ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తోటి మంత్రులతో కలిసి ఈరోజు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు రావాలని వారు సీఎంను కోరారు. అందుకు సంబందించిన ఆహ్వాన పత్రికను వారు సీఎంకు అందజేశారు.