సహకార సంఘాలు కేవలం రైతులనే కాదు మహిళలనూ ప్రోత్సహించేందుకు ముందుంటున్నాయి. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాలకు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో డీసీసీబీ ద్వారా ఈఆర్థిక సంవత్సరం 2,661 మహిళా సంఘాలకు రూ.214 కోట్ల రుణాలు అందించారు. సంగారెడ్డి జిల్లాలో 1214 సంఘాలకు రూ.86.86 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 665 సంఘాలకు రూ.66.22 కోట్లు, మెదక్ జిల్లాలో 782 సంఘాలకు 60.99 కోట్ల రుణాలు అందించారు.