నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 568.30 అడుగులు (252.3094టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి మొత్తం 31,124 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా, 603 క్యూసెక్కుల నీరు ఆవిరి ఆవుతోంది. ఎగువనుంచి 7,519 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.