90 రోజుల గడువులో మూడు వాయిదాలు చెల్లిస్తే రాజీవ్ స్వగృహా ప్లాట్ సొంతం చేసుకోవచ్చని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాజీవ్ స్వగృహ ప్లాట్లను బహిరంగ వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరులోని కోకట్ గ్రామ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కూడ ఈనెల 14న వేలం వేస్తున్నారన్నారు.