స్మార్ట్ఫోన్లు వద్దంటూ అంగన్వాడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గ్రామాల్లో సిగ్నల్స్ అందడం లేదని.. దీంతో 14 రకాల రికార్డులు నమోదు చేయడం ఇబ్బంది అవుతోందన్నారు. దీనికితోడు స్మార్ట్ఫోన్లు ఇచ్చి మరో 24 రకాల సేవలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు.