పల్లెల‌ను చూస్తుంటే గుండె నిండిపోతోంది

  • మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్

వ‌రంగ‌ల్ జ‌న‌వ‌రి 6: పల్లెలను పంటలను చూస్తుంటే గుండెనిండిపోతోంద‌ని ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ అన్నారు. మ‌హ‌బూబాబాద్ మండ‌లం వేంనూరులో గురువారం రైతు బంధు సంబురాలు ఘ‌నంగా నిర్వ‌హంచారు. పంట పొలంలోకి దిగిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా నాటు వేయడంతో పాటు వరినారుతో సీఎం కేసిఆర్ పేరు రాసి కృతజ్ఞతను తెలిపారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వాహనంలో వస్తుంటే భూమికి పచ్చని రంగేసినట్టు రైతన్నల ఇంటికి పండుగొచ్చినట్టు గుండెనిండిపోయిందని.. సాక్షాత్తు అపరభగీరదుడు సీఎం కేసిఆర్ ఎదురొచ్చి పలకరించిన అనుభూతి కలుగుతుందన్నారు.