యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురువారం ఉదయం పూర్తిగా మంచుతో కప్పబడినట్టుగా కనిపిస్తున్న దృశ్యాన్ని భక్తులు తమ రెండు కళ్ళు చాలవన్నట్లుగా తనివితీరా వీక్షించారు. ఎంత చలి, పొగమంచు కురుస్తున్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. శ్రీవారి ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడిన హిమాలయా పర్వతాలు మాదిరిగా దర్శనం ఇవ్వడంతో చూపరులకు కనువిందు చేసింది.