ఎడిట్ నోట్: హస్తం సత్తా తగ్గలేదా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గలేదా? ఇంకా కాంగ్రెస్ పార్టీని అభిమానించే వారు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగానే ఉందా? అంటే తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభ బట్టి చూస్తే..కాంగ్రెస్ పార్టీ సత్తా తగ్గలేదనిపిస్తుంది.

రేవంత్ పి‌సి‌సి అధ్యక్షుడు అయిన మొదట్లో..భారీ సభలతో ప్రజల్లో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో నేతలు ప్రజల్లో తిరగడం తగ్గింది. పైగా రాజకీయ పోరు బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య జరుగుతున్నట్లు కనిపించింది. ఈ సమయంలో కాంగ్రెస్ వెనుకబడింది. కానీ ఇటీవల రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ రావడం, నేతల సమస్యలని తెలుసుకోవడం, అలాగే కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే వచ్చి..పరిస్తితులని చక్కదిద్దడం. అటు రేవంత్ రెడ్డి-కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడంతో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చింది.

May be an image of 1 person and crowd

ఇదే క్రమంలో తాజాగా నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. ఊహించని విధంగా సభకు జనం వచ్చారు. అడుగడుగున రేవంత్ రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీని బట్టి చూస్తే కాంగ్రెస్  సత్తా ఎక్కడా తగ్గలేదని అర్ధమవుతుంది. అలాగే రేవంత్ రెడ్డి సైతం..కే‌సి‌ఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ‘భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల సాధన కోసం జరిగిన అనేక పోరాటాలకు నల్లమల వేదిక. పోరాట వారసత్వం ఉన్న జిల్లా వాసులం. దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు రజాకార్లకు పట్టిన గతి తప్పదు’ అని వార్నింగ్ ఇచ్చారు.

దేశంలో అత్యంత ప్రమాదకరమైన నేత కేసీఆర్ అని, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని,  కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదని,  కేవలం బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ డ్రామాను మొదలు పెట్టారని విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ నేతలంతా కలిశామని, ఇంకా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్ బలం ఇంకా తగ్గలేదని అర్ధమవుతుంది. నేతలు సరిగ్గా పనిచేస్తే..పార్టీ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news