ఎడిట్ నోట్: అమరావతిపై అత్యుత్సాహం..!

-

రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానులని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి..అది చట్టబద్దంగా చెల్లదని తెలుసుకుని ఆ బిల్లుని ఉపసహరించుకున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై హైకోర్టు కూడా సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే..ఈ ఏడాది మార్చి 3న..రాజధానిని మార్చే హక్కు అసెంబ్లీకి లేదని, అలాగే అమరావతి భూములని మార్టిగేజ్ చేయడం, థర్డ్ పార్టీకి అమ్మడం లాంటివి చేయకూడదని, ఇక అమరావతిలో రాజధానిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని, రైతుల ప్లాట్‌లని 3 నెలల్లో ఇవ్వాలని, అలాగే అభివృద్ధి చేయాలని, రాజధాని ప్రాంతంలో నెలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది.

- Advertisement -

 

అయితే తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళి..హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కానీ సుప్రీం కోర్టు కొన్ని అంశాలపైనే స్టే ఇచ్చింది. అవి ఏంటంటే ఆరు నెలల్లో రాజధాని అభివృద్ధి, మూడు నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి, నెలలో మౌలిక సదుపాయాలు కల్పించడం లాంటి అంశాలపై స్టే ఇచ్చి..తుది విచారణని 2023 జనవరి 31కు వాయిదా వేసింది. సుప్రీం తీర్పుపై ఎవరికి వారు కొత్త అర్ధాలు చెప్పుకుంటున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఏమో ఏపీ ప్రభుత్వానికి ఊరట అని, అమరావతికి షాక్ అన్నట్లు కథనాలు వేస్తుంది. ఇస్తూ టీడీపీ అనుకూల మీడియా ఏమో..జగన్ ప్రభుత్వానికి షాక్ అని కథనాలు ఇస్తుంది.

కానీ ఇందులో వాస్తవాలు చూస్తే..ఇరువురికి షాక్ ఇచ్చినట్లే అని చెప్పొచ్చు. కాకపోతే ఈ అంశంపై వైసీపీ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే స్టే ఇచ్చింది..ఫలానా గడువుల్లోపు పూర్తి చేయాల్సి ఉన్న రాజధాని అభివృద్ధి, రైతుల ప్లాట్లు అభివృద్ధి, ప్లాట్లు పంపకాల విషయంలో స్టే ఇచ్చింది. కేవలం హైకోర్టు గడువు పెట్టడంపైనే స్టే ఇచ్చింది. అంటే ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయవద్దని కాదు, ప్లాట్లు అభివృద్ధి చేయవద్దని కాదు.

అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది..ప్రభుత్వం కోరిన విషయం వచ్చి..రాజధానిని మార్చే హక్కు అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం స్టే కోరింది. కానీ సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తిస్థాయిలో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఆర్డీయేలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, భూములిచ్చిన రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారని, దానిపై నిధులు వెచ్చించారని, ప్రజాధనంప్రజా విశ్వాసంరాజ్యాంగంనైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదని అభిప్రాయపడింది.

అంటే ఇక్కడ ఇక్కడ వైసీపీ సర్కార్‌కు అనుకూలంగా వచ్చింది పెద్దగా ఏమి లేదు..కానీ వైసీపీ మంత్రులు మాత్రం తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి అమరావతి అంశాన్ని ఈజీగా దాటి వెళ్ళడం వైసీపీ సర్కార్‌కు కష్టమే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు పెడతామని, త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. మరి రాజధాని అంశం చివరికి ఏం అవుతుందో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...