ఎడిట్ నోట్: జగన్ ‘ఓటు’ రాజకీయం..!

-

రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమమైన చేయని..ఎలాంటి రాజకీయమైన చేయని..వారి చివరి లక్ష్యం ఓటు. ఆ ఓట్ల కోసం ఎలాంటి రాజకీయమైన చేయడానికి వెనుకాడారు. ప్రజస్వామ్యంలో ఓటే కీలక అంశం. ఆ ఓటుతోనే అధికారం దక్కుతుంది. అందుకే రాజకీయ పార్టీల లక్ష్యం ఓటు. అయితే మళ్ళీ ఆ ఓటు దక్కించుకుని రెండోసారి అధికారంలోకి రావడానికి జగన్ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది..మరోవైపు జనసేన సైతం కాస్త బలం పెంచుకుంటుంది. ఇలాంటి తరుణంలో టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్ పెరుగుతుందనే సంగతి జగన్‌కు బాగా తెలుసు.

అందుకే ఇప్పటినుంచే తనదైన శైలిలో ఓటు బ్యాంక్ రాజకీయం మొదలుపెట్టారు. అది కూడా రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ-కాపులనే ఎక్కువ టార్గెట్ చేశారు. ఎలాగో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాల మెజారిటీ ఓట్లు తమకే పడతాయని జగన్ భావిస్తున్నారు. అయితే ఆ ఓట్లు పడితే అధికారం దక్కడం అనేది ఈజీ కాదు. అత్యధికంగా ఉన్న బీసీ, కాపు ఓట్లు కూడా పడాలి. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాల ఓట్లు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే పడటం వల్ల భారీ మెజారిటీతో అధికారం దక్కింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు వర్గాలకు ప్రత్యేకంగా చేసిందేమి కనబడటం లేదు.

ఈ క్రమంలోనే బీసీలు కాస్త టీడీపీ వైపు, కాపులు కాస్త జనసేన వైపు వెళుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో జగన్ తన వ్యూహం మార్చేశారు. తాజాగా బీసీ మంత్రులు, నేతలతో సమావేశమై..రానున్న రోజుల్లో బీసీ వేదికలు, సమావేశాలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. బీసీలకు ఏమేమి చేశాం అనే అంశాలపై అవగాహన చేయాలని సూచించారు. అటు కాపు వర్గం ఓట్లు కూడా పోకుండా ప్లాన్ చేస్తున్నారు. కాపుల మద్ధతు కోసం..పలువురు కాపు నేతలని వైసీపీలో చేర్చుకునే ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకొనున్నారు. వచ్చే నెలలో ఆయనని వైసీపీలోకి తీసుకుంటున్నారు. అటు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం అంటూ హడావిడి చేసి పరోక్షంగా జగన్‌కు బెనిఫిట్ చేసిన ముద్రగడ పద్మనాభంని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కాపు, బీసీ ఓట్లని లాగడానికి జగన్ గట్టిగా ట్రై చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news