ఎడిట్ నోట్: వివాదానికి ఫుల్‌స్టాప్?

-

మొత్తానికి గత కొన్ని రోజులుగా కే‌సి‌ఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ అన్నట్లు జరుగుతున్న వివాదానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తుంది. తాజాగా బడ్జెట్ అంశంలో కే‌సి‌ఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే కే‌సి‌ఆర్ ప్రభుత్వం..గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.

అలాగే తన ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న కే‌సి‌ఆర్ సర్కార్ పై తమిళిసై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. గతేడాది అలాగే గవర్నర్ ప్రసంగం లేకుండానే కే‌సి‌ఆర్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ముగించేసింది. ఈ ఏడాది కూడా అదే తరహాలో ముందుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్..బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయలేదు. దీంతో కే‌సి‌ఆర్ సర్కార్ కోర్టుకు వెళ్లింది. కోర్టు కలిపించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ప్రభుత్వ అధికారులు, రాజ్ భవన్ అధికారులు సయోధ్య కుదుర్చుకున్నారు.

 

దీంతో గవర్నర్ ప్రసంగానికి సర్కార్ ఓకే చెప్పింది..అలాగే ప్రభుత్వం తరుపున  రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. బడ్జెట్‌ ముసాయిదాకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను మంత్రి కోరి, ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నామని, 3న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్‌ అంగీకరించి, బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. అలాగే గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 7 ప్రభుత్వ బిల్లులపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

మొత్తానికి కే‌సి‌ఆర్ సర్కార్-గవర్నర్‌ల మధ్య వివాదం కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. అయితే ఈ పరిస్తితి ఇలాగే కొనసాగుతుందా? మళ్ళీ ఎక్కడైనా విభేదాలు వస్తాయనేది చూడాలి. పైగా బడ్జెట్‌ ప్రసంగం కాపీని గవర్నర్‌కు అందించారు. అందులో ఉన్నది ఉన్నట్లుగానే చదువుతారా? లేక గవర్నర్..కే‌సి‌ఆర్ సర్కార్‌కు షాక్ ఇచ్చేలా ముందుకెళ్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news