ఏపీలో ఈ సారి టీడీపీ గనక అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన ఓటమికి కారణం ఈవీఎంలేనని గట్టిగా వాదించనున్నారట. ఈవీఎంలలో ఉండే లోపాల వల్లే తాము ఓడిపోయామని చంద్రబాబు జాతీయ స్థాయిలో నేతలనందరినీ ఏకం చేసి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది.
మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికలతోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కేంద్రంలో ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్, బీజేపీలు స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం లేదని.. సర్వేలు చెబుతున్నాయి. అలాగే మరోవైపు ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవడం ఖాయమని కూడా సర్వేలు పదే పదే చెబుతున్నాయి. అయితే ఒకవేళ నిజంగానే సర్వేల రిపోర్ట్ నిజమై, ఏపీలో వైకాపా గెలిచి, జగన్ సీఎం అయితే.. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారు..? ఓటమిని అంగీకరిస్తారా..? అలాంటి స్థితిలో చంద్రబాబు వ్యూహం ఏమిటి..? అంటే.. ఆయన అదే స్థితి వస్తే పలు ఆప్షన్లను రెడీ చేసుకున్నట్లు తెలిసింది.
ఏపీలో ఈ సారి టీడీపీ గనక అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన ఓటమికి కారణం ఈవీఎంలేనని గట్టిగా వాదించనున్నారట. ఈవీఎంలలో ఉండే లోపాల వల్లే తాము ఓడిపోయామని చంద్రబాబు జాతీయ స్థాయిలో నేతలనందరినీ ఏకం చేసి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలపై తమకు నమ్మకం లేదని, తిరిగి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని.. కోర్టులో పిటిషన్ వేస్తారని తెలిసింది.
అయితే చంద్రబాబు ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో పోలింగ్ అనంతరం పలు మార్లు ఈవీఎంలపై ధ్వజమెత్తారు. వాటిల్లో లోపాలు ఉన్నాయని, ఒక పార్టీకి ఓటు వేస్తే మరొక పార్టీకి ఓటు వెళ్తుందని ఆరోపించారు. ఈ క్రమంలో తన ఓటమి గురించి ముందుగానే తెలిసిన బాబు.. ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని.. వైసీపీ కూడా మండిపడింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు మే 23 ఫలితాల అనంతరం తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. ఎలాగూ ఈవీఎంలపై గతంలో ఆరోపణలు చేశారు కనుక.. అదే పంథాను కొనసాగిస్తూ.. మరోసారి ఈవీఎంలపై ఆరోపణలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
టీడీపీ అధికారంలోకి రాని పక్షంలో ఈవీంలలో లోపాలున్నాయనే వాదనను గట్టిగా వినిపించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది. అలాగే ఏపీలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చేందుకు కూడా యత్నించనున్నారట. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఏపీలో మళ్లీ ఎన్నికలు జరపబోమని అంటున్నారు. ఎందుకంటే.. 46 వేల ఈవీఎంలను ఎన్నికలకు వాడితే వాటిలో కేవలం 400 ఈవీఎంలు మాత్రమే పనిచేయలేదని, అంత మాత్రాన తిరిగి ఎన్నికలను నిర్వహిస్తామని అనుకోవడం పొరపాటే అవుతుందని.. మే 23వ తేదీన వచ్చే ఫలితాలే ఫైనల్ అని.. మళ్లీ ఎన్నికలను నిర్వహించబోమని.. అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో ఫలితాలు ఎలా వచ్చినా.. ఏ పార్టీ అయినా వాటిని ఒప్పుకుని తీరాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరిపైనైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు. అయితే మరి.. మే23వ తేదీన ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!