బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 87 పోస్టులు.. డిగ్రీ ప్యాస్ అయితే చాలు..!

-

బ్యాంక్‌: మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చెయ్యచ్చు. ఈ పోస్టులని భర్తీ చేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జబ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ఎంఎస్ఎంఈ, ట్రాక్టర్ లోన్ విభాగంలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనిలో మొత్తం 87 ఖాళీలు వున్నాయి. వాటిని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మే11వ తేదీ దాకా అవకాశం వుంది. కనుక ఆ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఇక పోస్టుల వివరాలు చూస్తే.. జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ బిజినెస్), రీజినల్ సేల్స్ మేనేజర్ (ట్రాక్టర్ లోన్), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్, జోనల్ సేల్స్ మేనేజర్ (ఎంఎస్ఎంఈ – సీవీ/సీఎంఈ), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్.

సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ -ఎల్ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ – సేల్స్ సీవీ/సీఎంఈ లోన్స్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ – సేల్స్ ఫారెక్స్ (ఎక్స్ పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్) వంటి ఖాళీలు వున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలానే పని అనుభవం కూడా తప్పని సరి. పూర్తి వివరాలు ని https://www.bankofbaroda.in/ లో చూసి అప్లై చెయ్యవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version