నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని ఉద్యోగాలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో

పలు ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ తాజగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ మరియు వాచ్ మెన్ కం గార్డెనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఆఫీస్ అసిస్టెంట్-3 పోస్టులు, అటెండర్ – 1 పోస్టు, వాచ్ మెన్ కమ్ గార్డెనర్ – 3 పోస్టులు. ఇక అర్హత కోసం చూస్తే…ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకి బేసిక్ అకౌంటింగ్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండి… ఎంఎస్ ఆఫీస్, టాలీ&ఎక్సెల్ లో ప్రొఫిషియంట్ అయి ఉంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకి అర్హులు. అలానే స్థానిక భాషలో టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ స్కిల్ ఉన్న వారికి ప్రాధాన్యాత ఉంటుంది.

అదే అటెండెంట్ పోస్టుకి మరియు వాచ్ మెన్ కమ్ గార్డెనర్ పోస్ట్ కి అయితే స్థానిక జిల్లాలో నివాసం ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. వయస్సు విషయంలోకి వస్తే.. ఆఫీస్ అటెండెంట్: 18-45 ఏళ్లు, అటెండెంట్: 18-65 ఏళ్లు, వాచ్ మెన్ కమ్ గార్డెనర్: 18-65 ఏళ్లు. పూర్తి వివరాలని ఈ కింద లింక్స్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

https://bankofindia.co.in/pdf/RSETIRatnagiri_19062021.pdf
https://bankofindia.co.in/pdf/RSETISindhudurg_19062021.pdf

 

Read more RELATED
Recommended to you

Latest news