BSNLలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా …? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల అప్రంటీస్ ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ ని విడుదల చేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

ఈ నోటిఫికేషన్ ద్వారా 55 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో పని చెయ్యాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థులకు నెలకు రూ. 8 వేల చొప్పున స్కాలర్ షిప్ ఉంటుంది. ఎంపికైన వాళ్ళు మహారాష్ట్రలో పని చెయ్యాల్సి వుంది.

ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోచ్చు. ఇక వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 29 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. డిసెంబర్ 29 దాకా అప్లై చేసుకోచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

ముందు www. mhrdnats.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ Enroll పై క్లిక్ చేయాలి. అలానే అప్లికేషన్ ఫామ్ లో వివరాలు నింపాలి.
మీకు యునిక్ ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ లాగిన్ అవ్వాలి.
Establishment Request Menu క్లిక్ చేయాలి.
Find Establishment క్లిక్ చేయాలి. Resume అప్ లోడ్ చేయాలి. తర్వాత Establishment name ను ఎంపిక చేసుకోవాలి.
BA ఎస్టాబ్లీష్మెంట్ పేరును టైప్ చేసి సెర్చ్ చేయాలి. నెక్స్ట్ అప్లై పైన క్లిక్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version