పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలని పాటిస్తే మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీగా పరీక్షని రాసి వచ్చేయొచ్చు చాలా మంది పిల్లలకి పరీక్షలు అంటే భయం వేస్తుంది.
పరీక్షలు ఎలా రాయగలను ఫెయిల్ అవుతానేమో.. ఇలా చాలా రకాల సందేహాలు వాళ్లలో ఉంటాయి దాంతో ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఏది ఏమైనా పిల్లలు స్థిమితంగా పరీక్షని రాసి వస్తే మంచిది కొంతమంది విద్యార్థులు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పదేపదే వాళ్ళల్లో ఫెయిల్ అయిపోతానేమో అని అనిపిస్తూ ఉంటుంది అయితే మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకోవాలి.
మీ శరీరాన్ని మీ మెదడు ని రెండిటిని బ్యాలెన్స్ చేసేలా షెడ్యూల్ చేసుకోండి. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న సమయంలో మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ని తీసుకుంటూ ఉండండి. దీంతో మళ్ళీ మీరు చదువుకోడానికి సిద్ధమవుతూ ఉంటారు. మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఎమోషనల్ సపోర్ట్ కోసం మీరు మీకు నచ్చే వ్యక్తులతో మాట్లాడండి. మీ తల్లి లేదంటే మీ తండ్రి ఇలా మీరు ఎమోషనల్ సపోర్ట్ కోసం మీ ఫీలింగ్స్ ని పంచుకోండి. ప్రశాంతంగా మంచిగా ఉండేటట్టు చూసుకోండి.
ఏ విధంగా అనుసరిస్తే ఒత్తిడి దూరమవుతుంది.. ఏ విధంగా అనుసరిస్తే బాగుంటాను అని మీకు అనిపిస్తుందో దానిని ఫాలో అవ్వండి. ఉదాహరణకి కొంతమందికి వాకింగ్ చేస్తే బాగుంటుంది. అలా మీకు నచ్చిన దాన్ని మీరు అనుసరించండి.
జరగని వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవద్దు. ఏది జరుగుతుందో వాటి మీదే ఆశ పడండి. జరగని వాటికి దూరంగా ఉంటేనే మంచిది.
మంచిగా నిద్రపోవడం కూడా ఎంతో ముఖ్యము. మంచిగా తినడం నిద్రపోవడం ఇవన్నీ కూడా తప్పక ఫాలో అవ్వండి దీనితో మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.