ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్‌ నేవీ స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు జూన్‌ 2023 కింద 70 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్‌ పోస్టులు ఈ మేరకు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మహిళలు/పురుష అభ్యర్ధులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. పదో తరగతితో పాటు ఇంటర్మీడియల్‌లో కనీసం 60 శాతం మార్కులతో కనీసం అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి.

సంబంధిత స్పెషలైజేషన్‌ లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ లేదా బీసీఏ లేదా కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బీఎస్సీ/ ఎంసీఏలో ప్యాస్ అయ్యి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. జులై 2, 1998 నుంచి జనవరి 1, 2004 మధ్య పుట్టిన వాళ్ళే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవాలి.

అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరవాత ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే కేర‌ళ‌లోని ఎజిమ‌ళ‌లో ఉన్న ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ లో ట్రైనింగ్ ఇస్తారు. పూర్తి వివరాలని https://www.joinindiannavy.gov.in/ లో చూడచ్చు.