రీడ‌ర్స్ నోట్ : మంచి నాన్న‌ను చ‌దివాను

-

మంచి – చెడు వీటి ద్వంద్వార్థాలు
బిడ్డ‌ల‌కు నేర్పాలి
మంచి..చెడుకు సాయం చేయ‌క‌పోతే మంచి
చెడు..మంచి నిర్మాణ గ‌తిని కూల్చ‌కుండా ఉండ‌గ‌లిగితే మంచి
వీటి ద‌గ్గర బిడ్డ‌లు ఎలా ఉన్నారు.. ఏది మంచి? ఏది చెడు? ఇలాంటి ప్ర‌శ్న‌లు బిడ్డ‌ల‌కు ఇవ్వండి..మీరు మాట్లాడితేనే ప్ర‌శ్న‌లూ.. జ‌వాబులూదోగాడుతున్నాయి క‌దా! ఇదీ ప్ర‌కాశ్ అందించే మ‌నోగ‌తం.

ఇప్పుడిలా వాక్యం ఉంది
“నాన్న ద‌గ్గ‌ర బిడ్డ ఎదిగిన ఊహ
అమ్మ దగ్గ‌ర బిడ్డ ఎగిరిన గువ్వ
రెక్క‌లు ఇవ్వండి కాదు రెక్క‌లు క‌ట్టుకుని పోనివ్వండి..ఇది క‌దా కావాలి..గువ్వ‌ల‌కు రెక్క‌లు..గూటి ప‌క్షుల తోడు నుంచి వీడుకోలు..కాస్త మీ ఆకాశం నుంచి అగాధం దాకా ఎగర‌నివ్వండి..ఎగరనివ్వ‌డం స్వేచ్ఛ.. ఎద‌గ‌నివ్వ‌డం బాధ్యత ” అని విన్నాను.బిడ్డ‌లంతా బాధ్య‌త‌గా స్వేచ్ఛ‌ను విని యోగించుకోవాలంటే వారితో మీరు మాట్లాడాలి..వింటున్నారా..అంటున్నాడా ప్ర‌కాశ్..మంచి తండ్రి నుంచి మంచి,చెడ్డ తండ్రి నుంచి మంచి నేర్చుకూనే ఉంటా రు బిడ్డ‌లు అంటారాయ‌న.

అమ్మ‌చాటు బిడ్డ‌లు
కొమ్మ‌చాటు పూవులు
బిడ్డ‌లూ పూవులూ ఒక్క‌టే
ప‌సి పాదాలకు  కందిపోవ‌డంతెల్సు
అమ్మ‌కు పాదాల‌ను కందిపోనీయ‌క‌పోవ‌డం తెల్సు
పూల‌కూ-రాగాల‌కూ విడిపోవ‌డం తెలియ‌దే…
క‌నుక క‌మ్మ‌ని రాగం అమ్మ అందిస్తే..నాన్న పాదాల‌ను కంద‌నీయ‌క ఆ రాగాల‌ కు అనున‌యంగా న‌డ‌క నేర్పుతాడు..భుజాన ప్ర‌పంచాన్ని,హృద‌యాన కొత్త ఆ కాశాన్ని నిర్మిస్తాడు..ఆకాశ‌మంత నాన్న ఉన్నాడా..అబ్బో!నా దృష్టిలో మ‌నిషే అద్భుతం అంటాడు వాడు..వాడే ప్ర‌కాశ్ రై అదేనండి ప్ర‌కాశ్ రాజ్..బిడ్డ‌లతో మాట్లాడ‌డం ఓ అల‌వాటు కావాలి..బిడ్డ‌ల నుంచి పారిపోవ‌డం కొందరి కి ఓ అల‌వాటు..కాదు అదొక గ్ర‌హపాటు..వివ‌రించినంతగా..విస్త‌రించినంత‌గా.. ఇదివ‌ర‌క‌టి ఆలోచ‌న ఉంటుంద‌ని అనుకోగ‌ల‌మా..బిడ్డ‌ల ద‌గ్గ‌ర అన్నీ చెప్పాలి.. అంతా చెప్పాలి..వారితో మాట్లాడడం మానుకోవ‌డం నేరం. వాడి ప్ర‌పంచంతో ఏ బంధం పెంచుకోక ఉండిపోవ‌డ‌మే పెద్ద నేరం..ఇవేచెబుతున్నాడు ప్ర‌కాశ్..మా ట్లాడినంత మాట్లాడాలి..మీ పిల్లల ద‌గ్గ‌ర మీరు పిల్ల‌లు మీరు తండ్రిగా పుట్టారు మ‌నిషిగా ఎదిగారు భ‌ర్త‌గా కాదు బాధ్య‌త‌గా మారిపోవాలి ఇవాళ అంటున్నాడీ ప్ర‌కాశ్ ..భ‌ర్త‌గా భార్య‌గా విడిపోవ‌డం  గురించి చెప్పేడు
త‌ల్లిదండ్రులుగా విడిపోక‌పోవ‌డం గురించి చెప్పేడు

పిల్ల‌ల‌కు నేర్ప‌డం అన్న‌ది ఓ ప్రాథ‌మిక అవ‌స‌రంగా ఎలా మారాలి ఈ త‌ల్లిదం డ్రుల‌కు – మీరు పుస్త‌కాలు ఇవ్వండి లేదా మీరే ఓ పుస్త‌కంగా మారండి తెర‌చిన పుస్త‌కంలో లొసుగులా నో..నో..నో ఛాన్స్..అలాంటివే వ‌ద్దు..రియల్ పేరెంటింగ్ అంటే ఇదే..
“గ్రోత్ అంటే ఎద‌గ‌డం కాదు ఎద‌గ‌నివ్వ‌డం ..గ్రోత్ రేట్ అంటే లెక్కింపు కాదు కావాల్సినంత‌గా ఎగ‌బాకేలా చేయడం”
ఇవి కాదా కావాలి.. మిస్ట‌ర్ ప్ర‌కాశ్ ఇవే చెబుతాడు..అమ్మా- నాన్నా వీరు క‌దా  మార్గద‌ర్శ‌కం కావాలి..
మీరు మాట్లాడ‌డం మొదలుపెట్టండి..పిల్ల‌ల‌తో ర‌హ‌స్యాలా?నో..నో..వాటికి చోటే ఇవ్వొద్దు..అని అంటున్నాడతడు.నాన్న‌లంతా ఒకలా..ఒకేలా..ఉంటార‌ని ఒక యూనిఫాం డ్రెస్ కోడ్ ఉంటుంద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌ను..?నాన్న‌లంతా మూర్ఖ‌త్వ‌ పు ముసుగులో ఉంటార‌ని ఉంటున్నారని ఎలా అనుకోగ‌ల‌ను..?ఓ ప్ర‌దేశాన్ని ఖాళీ చేశాక జీవితం వ్యాప్తిని ఎలా కోరుకుంటుంద‌ని.. ప్ర‌దేశాన్నీ,వ్యాప్తినీ ఒకేసా రి ప్రేమించ‌డం నేర్చుకోవ‌డం త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని..మంద‌లో త‌ప్పిపోతే నా
న్న- మంద‌లో మిగిలిపోతే నాన్న – మంద నుంచి మంద‌లింపు దాకా నాన్న.. మీ బిడ్డ‌ల‌కు ఈ తరహా నాన్న అర్థం అవుతున్నాడా? అన్నదే సిసలు ప్రశ్న.

ప్ర‌తి సారీ మీ బిడ్డ‌ల‌కూ – మీకూ మ‌ధ్య ఉండే అంత‌రం తొల‌గ‌డం క‌ష్టం అస‌లీ స‌ మ‌స్య ప‌రిష్కారానికి నోచుకుంటేనే వింత!అర్థం అవ్వండి మీ బిడ్డ‌కు..అర్థంను వి స్తృతం చేయ‌డం మానుకోక ప్ర‌య‌త్నిస్తూనే ఉండండి..మంచి పుస్త‌కంలో చెడ్డ వాక్యాలు ఉంటాయా? ఉండ‌నీ వాటినీ ఏరుకునే స్వేచ్ఛ ఒక‌టి వాటినీ త‌ప్పించే స్వేచ్ఛ ఒక‌టి మీ బిడ్డ‌ల‌కు మీరే ఇవ్వాలి అన్న‌ది ప్రకాశ్ రాజ్ మాట..చెప్ప‌క‌నే చెబుతున్న మాట..పుస్త‌కంలో మాట కాదు జీవితంలో మాట..జీవితం అనే పు స్త‌కం నుంచి నేర్చుకోద‌గ్గ మాట..త‌ల్లీ..తండ్రీ ఆచ‌రించ‌ద‌గ్గ మాట..బిడ్డ‌ల ద‌గ్గర ఓడిపోవ‌డం.. బిడ్డ‌ల‌ను గెలిపించే క్ర‌మాన ఒత్తిడిలో ఓడిపోవ‌డం అన్న‌వి వ‌ద్ద‌ నుకుంటే – కొన్నింట మేలిమి ఫ‌లితం కాస్త ఆల‌స్యం అయినా వ‌స్తుంది.మా అ మ్మ‌కూ,మా చెల్లికీ,నా భార్యకూ నేను అర్థం అయితే..నా బిడ్డ‌ల‌కూ నేను అంతే ..అర్థం కావాలి అన్న‌ది ఆయ‌న మ‌నోగ‌తం.తండ్రి అనేవాడు పిల్ల‌ల‌కు మ‌రిచి పోలేని క్ష‌ణాలు ఇవ్వాలి…అన్న‌ది అత‌డి ప్ర‌ తిపాద‌న అదే అత‌డి ఆచ‌ర‌ణ కూ డా!జీవితాన విల‌క్ష‌ణ‌త లేకుండా జీవితాన్ని నిర్వ‌చించ‌డం పుస్త‌కంలో రాసుకు న్నంత సులువు కాదేమో!హాహాహా!అవును తండ్రిగా మీరు పుట్టారు.మీతో పా టే మీలో మ‌నిషి కూడా ఇంకొంత మార్పు అందుకున్నాడు.. ఇప్పుడిక బిడ్డ‌ల లోకానికి మీరే స‌ర్వం స‌క‌లం  అన్న‌ది అ ర్థం అయితే మేలు..అది క‌దా!తెరిచిన పుస్త‌కం అంటే..ఇదే అత‌డి మాట.

మీ..మీ..జీవితాల్లో…………
మీ..మీ..ఇరుకిరుకు బ‌తుకుల్లో………………....
విస్తృతికి నోచుకోని జ్ఞాప‌కాల్లో…………………………
వ‌దిలించుకోవాల్సినంత మురికి
వ‌దిలించినా వీడిపోని మురికి
ఇంకా ఉంటే ఆ న‌లుపు చెరిపేయ‌డం ఓ ప్ర‌య‌త్నం
ఆ దిగులు రంగును వ‌దిలించ‌డం ఓ  చేయ‌క‌త‌ప్ప‌ని ప‌ని
బిడ్డ‌ల‌కు వాత్సల్యం – ప్రేమ వీటినే పంచాలి అనుకుంటే
మీరు..మీర‌నుకునే ప్ర‌పంచంలో త‌ప్ప‌క విజేత‌లే!
తెర‌చిన పుస్త‌కం నోరు తెర‌వ‌క చెప్పే జ్ఞాన  ర‌హ‌స్యం ఇదే!
పాదాల‌కు నేర్పాల్సింది ప‌రుగునో/న‌డ‌క‌నో ఏంట‌న్న‌ది తేల్చుకోవాల్సింది మీరే!
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Latest news