యోగాయ నమః.. యోగ ప్రక్రియ.. రకాలు

-

మన భారతదేశం పురాణాలకు.. ఆధ్యాత్మికతకు.. ఆయుర్వేదానికి.. యోగకు జన్మస్థలం. యోగ మానవాళికి వెల కట్టలేని వరంలాంటిది. యోగ అంటే జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన శాస్త్రం. యోగ అనేది మనిషి సృష్టి రహస్యాన్ని గురించి శోధించే ప్రయత్నంలో.. మానవ మేధలో వెలువడిన శాస్త్రమే యోగా..

మానవ సహజ పరిణామ క్రమము తెలియజేయు విజ్ఞాన శాస్త్రం యోగ. ఇక్కడ పరిణామం అనగా పురోగమనం. అంటే పురోభివృద్ధి పరిణామమనగా ఉన్న స్థితి నుంచి పైకి ఎదుగుట. ఈ స్థితియే ఆత్మ జ్ఞానం పొందుటకు సహాయపడును.. కాబట్టి యోగా సమగ్ర విజ్ఞాన శాస్త్రం అత్యంత సమగ్రత కోసం సంసిద్ధమైనది యోగా. భారతదేశంలోని రుషులు, మునులు, సన్యాసులు, ప్రవక్తలు.. మొదలైన వారి గడిచిన గత 5000 సంవత్సరాల కాలంలో పెంపొందించిన జీవన విధానాలు వాటి ముఖ్య ఉద్దేశం ఒక్కటే..

ధ్యానమే యోగం..

ధ్యానం మనస్సు నిర్మలత్మం చెందడానికి మనం ఉపయోగించుకొనే విధాలన్నీ ధ్యానం కిందకు వస్తాయి. ధ్యానం అనగా మనస్సును లగ్నం చేయుట. భక్తి భావం మంత్ర జపము మొదలైనవన్నీ ధ్యానమే. మెడిటేషన్‌ అనే పదం మేడేరి అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దాని అర్థం జబ్బు నివారించుట. అంటే.. శారీరకంగా, మానసికంగా, ప్రాణ సంహితంగా ఉండే రోగాలన్నీ ధ్యానం వలన నివారించవచ్చు.

నిత్య జీవితంలో..

ఇప్పటి యోగ నిత్య జీవితంలో ఫిట్‌నెస్‌ కోసం చేసే కార్యక్రమంగా ముద్ర పడింది. నిత్యం ఎన్నో టెన్షన్లతో బాధ పడేవారు. కాసేపు ఈ యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాల సాధనతో చెప్పలేని రిలాక్సేషన్‌ పొందుతారు. యోగ అలసిన మనసులకు అమృతం. ప్రతి రోజూ అధిక ఒత్తిడితో బాధపడే ఎంతో మందికి దివ్యౌషదం యోగా. ఈ విషయం సైన్స్‌ కూడా ఒప్పుకొన్నది. ఇన్ని రోజులు యోగాసనాలు యోగుల మాత్రమే వేస్తారు అనే భావన తొలిగిపోయి ప్రతీ ఒక్కరం అభ్యసించే కళగా నలుగురికి సుపరిచితమైంది.

చక్కటి ప్రక్రియ..

యోగ మన శారీరక మానసిక భావపరమైన సమస్యలకి చక్కగా సమాధానం చెబుతుంది. యోగ శరీరాన్ని, మనసుని అనుసంధానం చేసే చక్కటి ప్రక్రియ. యోగ మనిషి ప్రవర్తన, దృష్టి ఆలోచన జీవన శైలిని ప్రభావితం చేయగల విధానం. మానవుని సాధారణ లౌకిక జ్ఞానం నుంచి వేరు పరచి అత్యున్నత సత్యమైన బ్రహ్మ విద్యతో వేరు పరచుటనే యోగ. ఈ ఆచరణలన్నీ మానవుని దుఃఖము నుంచి, లోపముల నుంచి వేరు పరిచి విముక్తినిస్తుంది. ఏ మానవుడయితే అనంతమైన దుఃఖమును అధిగమించి పరిపూర్ణ పరమానంద భరితమైన ఆత్మ జ్ఞానం పొంది, అత్యున్నత సత్యంలో ఐక్యతను పొందుతాడో అతడే నిజమైన విముక్తిని పొందిన వాడు. ఈ స్థితియే మానవ జీవన పరిణామ చివరి గమ్యం.

చాలా రకాలు

యోగ ఒకే రకంగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఇందులో చాలా రకాలున్నాయి. అవి.. భక్తి యోగ, రాజ యోగ, కుండలినీ యోగ, స్వర యోగ, రాజ యోగ, హరి యోగ, కర్మ యోగ, మంత్ర యోగ, అష్టంగమంత్ర యోగ. అందులో పతంజలి రచించిన అష్టాంగ యోగ చాలా ముఖ్యమైనది. అష్ఠాంగ యోగ నందు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన , సమధి అను అష్ట అంగములు కలవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version