తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో 18వ తేదీన మంచినీళ్ల పండుగ

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. జూన్ 2వ తేదీ నుంచి 22 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 22 రోజుల పాటు రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ఈ వేడుకలను ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులర్పిస్తారు. 10.30 గంటలకు సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.

ఇందులో భాగంగా జూన్‌ 18న మంచి నీళ్ల పండుగ ఘనంగా నిర్వహించాలని మిషన్‌ భగీరథ ఇంజినీర్లు, అధికారులను సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్‌ఈలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. 18న మిషన్‌ భగీరథ నీటిశుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ వేడుకల కోసం 32 జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version