దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ సాహిత్య దినోత్సవం

-

తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాలు.. చేసిన అభివృద్ధిని ఈ వేడుకల్లో భాగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.

దశాబ్ది వేడుకల్లో భాగంగా… ఇవాళ తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటేలా వేడుకల నిర్వహణకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రచన, పద్యం, కవిత్వంలో తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ఉత్సవాలు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరగనున్నాయి. 150మంది కవులు పాల్గొననున్న ఈ కమి సమ్మేళనంలో… ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా లక్షా 116తో పాటు ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేయనున్నారు.  అన్ని జిల్లాల్లో  కవులు, సాహితివేత్తలను గుర్తించి సత్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version