కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచిందని… ఈ బడ్జెట్ ను పూర్తిగా చదవడం కూడా వేస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ రాజ్యసభ్య ఎంపీ కే. కేశవరావు. కరోనా వేళ నిధులకు కోత పెట్టారని విమర్శించారు. మసిపూసి మారేడు కాయ చేసిన విధంగా బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ లో పేదలను విస్మరించారని ఆయన అన్నారు. ఆరోగ్య రంగాన్ని గాలికొదిలేశారని అన్నారు. ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించారని అన్నారు.
మౌళిక సదుపాయాలు, ద్రవ్యోల్బనం, నిరుద్యోగ సమస్యలు తీరేలా బడ్జెట్ లేదని అన్నారు. గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కన్నా తక్కువ నిధులు కేటాయించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ స్కీంలు రాకుండా మాపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆయన అన్నారు. ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధకరంగా ఉందని కేకే అన్నారు. తెలంగాణ నుంచి కొన్ని పథకాలను కాపీ కొట్టారని కేకే అన్నారు. ఈ బడ్జెట్ దశాదిశ లేకుండా ఉందని విమర్శించారు. బడ్జెట్ లో కార్పోరేట్ సెక్టార్ కే కొంత ఊరటనిచ్చారు. క్రిప్టో కరెన్సీపై క్లారిటీ లేదని ఆయన అన్నారు.