మళ్లీ కరోనా కలకలం….. కొత్త వేరియంట్ పై WHO వార్నింగ్

-

రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కోవిడ్ ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా కొత్తకొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడులు చేస్తూనే ఉంది. ప్రస్తుతం చైనా, హాకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ జడలు విప్పింది. చైనాలోని పలు ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీంతో మళ్లీ ప్రపంచం భయాందోళనకు గురువుతున్నారు. 

తాజాగా మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వార్నింగ్ ఇస్తోంది. తాజాగా XE ఓమిక్రాన్ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని WHO వెల్లడించింది. ఓమిక్రాన్ బీఏ.2 సబ్ బేరియంట్ కన్నా అధికంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బీఏ.2 వేరియంట్ కన్నా 10 రేట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. ఎక్స్ఈ కరోనా వేరియంట్ ను తొలిసారిగా బ్రిటన్ లో కనుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో 600 కన్నా ఎక్కువ కేసులు నిర్థారణ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news