హగ్ డే అంటే ఇదే…!

-

హగ్ డే’ మనం ఇష్టపడే వారిని కౌగిలించుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. వాలెంటైన్స్ వీక్‌లో ఈ ప్రత్యేకమైన రోజు ఉండటంలో ఆశ్చర్యం లేదు. అసలు వాలెంటైన్స్ వీక్ అంటే ఏమిటి అనుకుంటున్నారా..! వాలెంటైన్స్ డేకి ముందు వారాన్ని వాలెంటైన్స్ వీక్ అని పిలుస్తారు. ఫిబ్రవరి 7 నుండి మొదలవుతుంది. వారంలోని ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

దాన్లో భాగమే ఫిబ్రవరి 12 హగ్ డే. మనం ప్రేమించే వ్యక్తికి మన ప్రేమను వ్యక్తం చేసే విధానం లో కౌగిలింత ఒకటి. అంతే కాదు మనం ఇష్టపడే వారిని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గి రిలాక్స్ అనేది మనసుకు కలుగుతుంది. సంతోషం లో మాత్రమే కాదు బాధ లో ఉన్నప్పుడు కూడా కౌగిలింత ఓదార్పు ను ఇస్తుంది. కౌగిలింత అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తల్లి పిల్లల మధ్య,

ఇద్దరు స్నేహితుల మధ్య, ఆత్మీయుల దగ్గర పొందుతాం. కానీ కాలక్రమేణా దీనిని కొందరు దురుద్దేశం తో చూస్తున్నారు. కౌగిలించుకునే ముందు వారి అనుమతి పొందాలి లేకుంటే అది శారీరక వేధింపుగా లెక్కించవచ్చు. కాబట్టి ఎవరైనా మీ హగ్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. హగ్ అనేది ఇరువురికి ఇష్టపూర్వకంగా ఉండాలి, అప్పుడే దానిలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆశ్వాదించగలం.

Read more RELATED
Recommended to you

Latest news