ఆ దేశంలో మంగళవారం అస్సలు పెళ్లి చేసుకోరట… రీజన్‌ ఏంటో తెలుసా..!  

-

మనిషిని నడిపించేది డబ్బు అయితే.. బంధాలను నడిపించేది మాత్రం నమ్మకమే. నమ్మకం లేని బంధం.. గమ్యం లేని ప్రయాణం లాంటిదే. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆగిపోతుంది. అయితే నమ్మకం రిలేషన్‌లోనే కాదు.. కొన్ని విషయాలమీద కూడా జనాలకు బలంగా ఉంటుంది. తమ పూర్వీకులు ఏదో, ఎందుకో చెప్తారు. దాన్ని ఈనాటికి పట్టుకుని ఆచరిస్తూనే ఉంటారు. మన ఇళ్లలో కూడా మంచంమీద కుర్చోని కాళ్లు ఊపితే మేనమామకు అరిష్టం అని కొందరు చెప్తుంటారు. ఇక్కడ కాళ్లు ఊపడానికి అక్కడెక్కడో ఉన్న మేనమామకు సంబంధం ఏంటో అది మనకు అర్థంకాదు. ఇలాంటివి మన దగ్గరే కాదండోయ్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అవి మనకు కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
జర్మనీలో కొవ్వొత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులకు చెడు చేస్తుందట.
ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు… ఒక్కటే ఉన్న మాగ్పీ (Magpie)ని చూస్తే బ్యాడ్ లక్ అని భావిస్తారు.
బ్రెజిల్‌లో పర్స్ ఎట్టిపరిస్థితుల్లో నేలను తాకకూడదని నమ్ముతారు. అలా తాకితే… డబ్బంతా పోయి… పేదవారిగా మారతారని వారి భయం.
హట్సన్‌లో పడవలోకి అరటిపండ్లను తేనివ్వరు. ఒక్క అరటిపండును తెచ్చినా అనూహ్య పరిణామాలూ, ప్రమాదాలు జరుగుతాయని వారి నమ్మకం.
స్వీడన్‌లో మాన్‌హోల్ (Manhole) పై కాలు వెయ్యరు. వేస్తే ప్రేమ విఫలమవుతుందనీ, దురదృష్టం పట్టుకుంటుందని బలంగా నమ్ముతారు.
లాటిన్ అమెరికాలో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఆ రోజు చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. అసలక్కడ మంగళవారం పెళ్లిళ్లకు జనం కూడా వెళ్లరట. సో సాడ్..
వాచీలోగానీ, మొబైలో గాని ఎక్కడైనా సరే… క్లాక్‌లో 11:11 చూస్తే… ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుందని కొంత మంది నమ్ముతారు. ఓ సారి మీరు ట్రే చేసి చూడంది.!
టర్కీలో పిల్లల పైనుంచి జంప్ చెయ్యరు. అలా చేస్తే ఆ పిల్లలు ఎప్పటికీ పొట్టిగానే ఉండిపోతారని భావిస్తారట. అయ్యో !.
నైజీరియాలో పిల్లల పెదవులపై ముద్దు పెట్టరు. అలా పెడితే… ఆ పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారి జీవితం నాశనం అవుతుందని నమ్ముతారు. వామ్మో ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా..!
బ్రిటన్‌లో పూర్వం ఎకోర్న్ (acorn) కాయల్ని మహిళలు వెంట తీసుకెళ్లేవారు. అలా చేస్తే ఎప్పటికీ యంగ్ గానే ఉంటారని నమ్మేవారట.
అజర్‌బైజాన్‌లో ఉప్పు, మిరియాల పొడిని ఆహార పదార్థాలపై చల్లుకోరు. ఎందుకంటే ఆ దేశంలో అవి చాలా రేటెక్కువ. వాటిని చల్లుకుంటే ఎంతోకొంత గాలికి చెల్లా చెదురవుతాయనీ, వృథా అవుతాయని ప్రజలు అలా చేసేవారు కాదు.
దక్షిణ కొరియా ప్రజలు కిటికీలు, తలుపులు మూసివున్న ఇంట్లో ఫ్యాన్ ఆన్‌ చేసి నిద్రపోరు. అలా చేస్తే ఫ్యాన్ వల్ల చనిపోతారని నమ్ముతారుట. ఓడియమ్మ..ఇది హైలెట్‌ అసలు.!
జపాన్‌లో సూర్యాస్తమయం తర్వాత చేతి గోళ్లను కత్తిరించరు. అలా కత్తిరిస్తే త్వరగా చనిపోతారని నమ్ముతారట. మన దగ్గర కూడా ఇలా చేయరు. అరిష్టం అంటారు. అయితే పూర్వం రోజుల్లో కరెంట్‌ ఉండదు కాబట్టి ఈ రూల్‌ పెట్టారని, ఇప్పుడు పాటించడంలో అర్థంలేదని కొందరు అంటుంటారు. మీరు ఆ లిస్ట్‌లో ఉన్నారా..!
ఎవరికైనా పర్స్ గిఫ్టుగా ఇస్తే… అందులో ఎంతో కొంత మనీ పెట్టి ఇవ్వాలట. కనీసం కొన్ని నాణేలైనా ఉంచాలట. లేదంటే చెడు జరుగుతుందని విదేశాల్లో నమ్ముతున్నారు. దీన్ని మన దగ్గర కూడా కొందరు ఫాలో అవుతారు కదా..!
దక్షిణ కొరియాలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్లను కదపకూడదట. అలా చేస్తే ఆ వ్యక్తి సంపద మొత్తం చేజారిపోతుందట. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే… అందరూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట.
క్యూబాలో మద్యం తాగుతూ… ఇదే నా చివరి పెగ్ అని అనరు. అలా అంటే ఆ వ్యక్తిని తీసుకుపోయేందుకు మృత్యువు వచ్చేసిందని నమ్ముతారట. మన దగ్గర అయితే.. చాలామంది తాగుతూ..మామ ఇదే రా లాస్ట్.. మళ్లీ మద్యం ముట్టను అని తాగేస్తుంటారు కదా..! మీరు అంతేనా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version