మనిషిని ఒక్కసారి పాము కాటేస్తేనే.. ఉంటాడాపోతాడా అనేది డౌట్.. సరైన సమయంలో సరైన వైద్యం అందిచకపోతే ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ అతన్ని ఏకంగా 500 సార్లు పాము కాటేస్తూనే ఉంది. ఇది వింటుంటే.. మెగస్టార్ పున్నమినాగు సినిమా గుర్తుకువస్తుంది కదా..అందులో కూడా చిరంజీవిని పాము పదే పదే కాటేస్తుంది.. అయినా ఏం కాదు.. అది సినిమా కాబట్టి నడుస్తుంది. కానీ రియల్ లైఫ్ లో ఎట్లారా అనే కదా మీ డౌట్. అసలు అతన్ని ఎందుకు అన్నిసార్లు పాము కాటేస్తుంది. రీజన్ ఏంటి.? మహారాష్ట్రకు చెందిన అనిల్ తుకారామ్ గైక్వాడ్ స్టోరీ గురించి మనం తెలుసుకోవాల్సిందే.
మహా రాష్ట్రంలోని లాతూర్ జిల్లాలో గల ఔసా అనే పట్టణానికి చెందిన అనిల్ తుకారామ్ గైక్వాడ్. ఇతను గడిచిన 15 ఏళ్లలో సుమారు 500 సార్లు పాము కాటుకు గురయ్యాడు వ్యవసాయ కూలీగా జీవనం సాగించే అనిల్ గైక్వాడ్ పాముకాటు కారణంగా చాలా సార్లు పరిస్థితి విషమించి చావు అంచులదాకా వెళ్లాడు.. పొలం పనులు చేస్తున్న సమయాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో జనం మధ్య సంచరించే సమయంలో కూడా అతన్ని పాము వదలట్లేదు.
అనిల్ గైక్వాడ్ పాము కాటుకు గురైన ప్రతిసారి కుటుంబీకులు భారీగా ఖర్చు చేసి అతనికి చికిత్స అందిస్తున్నారు.అయితే.. 15 ఏళ్లపాటు దాదాపు 500 సార్లు పాము కాటుకు గురైన అనీల్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ పాములు పగపట్టినట్లుగా ఇతణ్నే ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావట్లేదని డాక్టర్లు కూడా అంటున్నారు.
అనిల్ కు 150సార్లకుపైగా వైద్యం చేసిన డాక్టర్ రణవేది కూడా ఇదే మాట చెప్తున్నారు.. సాధారణ కుటుంబానికి చెందిన అనిల్ గైక్వాడ్ పరిస్థితి ఎప్పటికి మారుతుందోనని కుటుంబీకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అసలు అతన్ని అన్ని సార్లు కాటు వేయడానికి సైంటిఫిక్ గా లేదా..ఏదైనా దోషం ఉందా అనేది వాళ్లు తెలుసుకోలేదు. అసలే పేద కుటుంబం..దెబ్బమీద దెబ్బ కాటువేసిన ప్రతిసారి అధికమొత్తంలో ఖర్చుచేసి మరింత కుంగిపోతున్నారు. మీరేం అనుకుంటున్నారు.. పాము అన్ని సార్లు కాటు వేయడానికి ఏదైనా రీజన్ ఉండి ఉండొచ్చంటారా..?
– Triveni Buskarowthu