ఆకులతో పెళ్లి భోజనం.. అవాక్ అయిన అతిధులు..!

సాధారణంగా పెళ్లి అంటే రుచికరమైన భోజనం పెడుతూ ఉంటారు. శాకాహారం అయినా, మాంసాహారం అయినా సరే చాలా రకాల వంటకాలు ఉన్నాయి. పెళ్లి లో వంటకాలు నిజంగా ప్రత్యేకం. ఎందుకంటే ఎన్నో రకాల ఐటమ్స్ పెడతారు. పైగా ఎంతో రుచికరమైన వాటిని ఇస్తారు. ప్రతి పెళ్లి లోని ఇది మామూలే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ వివాహానికి వచ్చిన గెస్ట్ లకి దిమ్మతిరిగిపోయింది. అయితే దిమ్మతిరిగే అంతలా ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని చూస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. శాకాహారుల కోసం శాఖాహారం అందించడం కోసం ఒక ప్లేటులో ఆకులు వేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యి పోయింది. రాకెట్ ప్లాంట్ తో గార్నిష్ చేసి కొన్ని మెలన్ స్లైసులు వేశారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు. ఏంటిది వంటకమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

క్యాటరింగ్ వాళ్ళు డబ్బులు కోసం ఇలాంటి ఆహారాన్ని ఇస్తున్నారా అని అంటున్నారు. ఒక యూజర్ అయితే మంచి శాఖాహారం పెళ్లిలో ఇస్తారు కానీ ఇంత చెత్త ఆహారాన్ని ఇస్తారా అంటూ చెప్పుకొచ్చారు. అలానే కేటరింగ్ వాళ్ళు ఇలాంటివి నచ్చినవన్నీ ప్లేట్ లో వేసి దాని మీద కొన్ని స్పైసెస్ వేసి ఇచ్చేసి అదే ఆహారం అని చెబుతూ ఉంటారు అని అన్నారు.