బాదంపప్పు: మనకు ఎప్పుడూ ఏదో ఒక సందేహం ఉంటేనే ఉంటుంది. ఇది చేయొచ్చా, ఇలా చేయొచ్చా.. ఇప్పుడు చేయొచ్చా. ఇక తినే విషయంలో అయితే జనాలకు ఎన్నో ప్రశ్నలు.. వేసవి కాలంలో.. తినే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఏది పడితే అది తింటే.. వేడి చేసి.. ఆగం ఆగం అవ్వాల్సి వస్తుంది. సాధారణంగానే.. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరిగినప్పటికీ కాస్త వేడిచేస్తుంది అనే భయం చాలా మందిలో ఉంది.. మరీ ఆ వేసవిలో నానపెట్టిన బాదం తినొచ్చా లేదా అనే డౌట్ కూడా మీకు ఉండే ఉంటుంది. కొంతమంది అయితే ఇలాంటి డౌట్ లేకుండా తింటూనే ఉన్నారు.
అసలు బాదంను నీటిలో ఎందుకు నానబెట్టాలి? అలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
బాదం పప్పు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు, గర్భిణీలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. రాత్రి పూట కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి తెల్లారి తింటూ ఉంటారు. అయితే కొంతమంది బాదంను నానబెట్టకుండా అలాగే తింటుంటారు. సహజంగానే బాదంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇక నానబెట్టిన బాదంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు అలాగే అవసరమైన పోషకాలన్నీ అధిక పరిణామంలో ఉంటాయి. అందుకే రోజూ బాదం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
ప్రస్తుతం చాలా మంది జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి బాదంను నానబెట్టకుండా తింటే దుష్ప్రభావాలు ఉంటాయి…అందుకే ఇలాంటి వారు బాదంను నానబెట్టి తినాలని నిపుణులు చెబుతున్నారు. బాదం నానబెట్టాక తినే సమయంలో తొక్క తీసి తినాలి. లేదంటే పొట్ట సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. ఈ రకమైన సమస్యతో బాధపడేవారు తప్పకుండా తక్కువగా బాదం తీసుకోవాల్సి ఉంటుంది.
నానబెట్టిన బాదంను ఖాళీ కడుపుతో తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే జుట్టుకు కూడా సంరక్షణగా పని చేస్తుంది. అలాగే మధుమేహం సమస్యలతో బాధపడే వారికి ఇవి తోడ్పడుతాయి. బాదంపప్పు తినడం వల్ల అన్ని ప్రయోజనాలు పొందాలంటే.. మీరు కచ్చితంగా నానపెట్టి తొక్కతీసే తినాలి. ఇక వేసివిలో తినొచ్చా లేదా అనే సందేహం అక్కర్లలేదు.. సరైన పద్ధతిలో తింటే ఏం సీజన్‌లో అయినా తినొచ్చు..!