కొత్తిమీరను ఇంట్లోనే ఇలా సులభంగా పెంచండి..! ఆ వ్యాధులను తరిమికొట్టండి..!

-

కొత్తిమీరను కేవలం మసాలా వంటల్లోనే కాదు.. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు.. ఎంత కొత్తిమీర తింటే.. అన్ని ప్రయోజనాలు.. ఇంకా రోజూ ఉదయం కొత్తిమీరతో జ్యూస్‌ చేసుకుని తాగారంటే.. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.. థైరాయిడ్‌, షుగర్‌, బీపీ, ఊబకాయం లాంటి మహామహా రోగాలను సైతం కొత్తిమీరతో కట్టిపడేయొచ్చు.. ఫ్రెష్‌ కొత్తిమీర దొరకడం ఈరోజుల్లో కాస్త కష్టమైన పనే.. మార్కెట్‌లో ఉంటుంది కానీ..అది నీళ్లు చల్లుతూ చల్లుతూ దాన్ని అప్పటిమందం ఫ్రెష్‌గా ఉంచుతారు.. ఇంటికి తెచ్చిన రెండోరోజే అవి వాడిపోతాయి.. ఇంట్లోనే కొత్తిమీర పెంచుకుంటే.. మీకు కావాలనుకున్నప్పడల్లా.. ఫ్రెష్‌గా కట్‌చేసుకుని వాడుకోవచ్చు. ఆర్గానిక్‌ కాబట్టి ఇంకా మేలు చేస్తుంది.

దీనికోసం ముందుగా కొన్ని ధ‌నియాల‌ను చేతిలోకి తీసుకుని న‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ధ‌నియాలు రెండు ముక్క‌లుగా అవుతాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక కుండినీ తీసుకుని దానిలో మ‌ట్టిని పోసి స‌మానంగా చేసుకోండి.. త‌రువాత ధ‌నియాల‌ను తీసుకుని కుండీలో చల్లాలి. త‌రువాత మ‌రికొద్దిగా మట్టిని తీసుకుని ఈ ధ‌నియాల‌పై ప‌లుచ‌గా చ‌ల్లాలి. ఇప్పుడు నీటిని తీసుకుని మ‌ట్టిపై కొద్దిగా చేత్తో చ‌ల్లండి. త‌రువాత ఈ కుండీని సూర్య‌ర‌శ్మి త‌గిలే చోట ఉంచాలి. రోజూ రెండుపూట‌లా కొద్దికొద్దిగా నీటిని చ‌ల్లుతూ ఉండాలి. మూడు నుండి నాలుగు రోజుల్లోనే ధ‌నియాల నుంచి మొల‌కలు వస్తాయి. ఇలా రోజూ నీటిని చ‌ల్లుతూ ఉండాలి. ప‌ది రోజుల్లోనే చిన్న చిన్నగా కొత్తిమీర రావ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ విధంగా స‌హ‌జ సిద్దంగా ఇంట్లో కొత్తిమీర పెంచుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రింత చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

కొత్తిమీరతో నోటి దుర్వాస‌న రాకుండా చేసుకోవచ్చు.. చిగుళ్ల స‌మ‌స్యలు త‌గ్గిస్తుంది. కొత్తిమీర‌కు జీవ‌క్రియ రేటును పెంచే శ‌క్తి ఉంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా కొత్తిమీర మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కొలెస్ట్రాల్‌ను క‌రిగించే యాంటి ఆక్సిడెంట్లు కొత్తిమీర‌లో ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌న‌కు ఎంతో మేలు చేసే కొత్తిమీర‌ను ఇలా సుల‌భంగా మ‌న ఇంట్లో పెంచుకోని మరింత ఆరోగ్యాన్ని పొందండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version