బచ్చలి కూర తిని ఆసుపత్రిపాలైన తొమ్మిది మంది..

-

ఈ మధ్య ఆరోగ్యానికి మేలు చేసేవి తినే కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి కొబ్బిరినీళ్లు తాగి చనిపోయాడు. ఇప్పుడు బచ్చలికూర తీని ఆసుపత్రిపాలయ్యారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే.. మన దగ్గర అంటే ఇవి పండిస్తారు.. ఫ్రష్‌గా తీసుకుంటాం.. కానీ విదేశాల్లో వీటిని కూడా మార్కెట్స్‌లో అమ్ముతారు.. కంపెనీలు ఉంటాయి.. అలాంటి ఓ కంపెనీ బచ్చలికూర తినే ఇప్పుడు తొమ్మిది మంది ఆసుపత్రిపాలయ్యారు.. అసలేం జరిగిందంటే..
బచ్చలి కూర కారణంగా ఆస్ట్రేలియాలో కొందరు ఆసుపత్రిపాలయ్యారు. విషపూరితమైన బచ్చలి కూర తిన్నవారంతా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.కోస్ట్‌కోకు చెందిన రివేరా ఫార్మ్స్ కంపెనీ బచ్చలికూర తిన్న తర్వాత తొమ్మిది మందికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన వారిలో లేనిది ఉన్నట్లుగా మతి భ్రమించడం, గుండె కొట్టుకునే రేటు పెరగడం, మసకమసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉన్నాయని వారికి చికిత్స చేసిన ఆరోగ్య అధికారులు తెలిపారు.
డిసెంబర్ 16‌కు ఎక్స్స్‌పైరీ డేట్‌ ఉన్న బ్రాండ్ బచ్చలికూరను వారు తిన్నారు. అలాంటివి తినడం సురక్షితం కాదని, ఆ ప్యాకెట్లను బయట పడేయాలని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. బచ్చలి కూర తిన్న తర్వాత అసాధారణంగా అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ప్రజలకు సూచించారు.
అయితే ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. కొంతమంది ఇంకా అనారోగ్యంతోనే ఉన్నారు. బచ్చలి కూర తిని ఆసుపత్రి పాలైనవారిలో కొందరికి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు భ్రమ కలుగుతోందని పాయిసన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ డారన్ రాబర్ట్స్ తెలిపారు.
కలుపు మొక్కల కారణంగా ఆ బచ్చలి కూర మొక్కలు కలుషితమై ఉంటాయని రివేరా ఫార్మ్స్ కంపెనీ చెబుతోంది. మిగతా అన్ని ఉత్పత్తులు బాగానే ఉన్నాయని తెలిపింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వెంటనే తాము చర్యలు తీసుకున్నామని రివేరా ఫార్మ్స్ అధికార ప్రతినిధి చెప్పారు. ఆ కలుషిత బచ్చలి కూరను వెంటనే తమ షాపుల్లో నుంచి బయటపడేయాలని సూచించినట్లు ఆయన వివరించారు. మిగతా ఎక్కడా ఇలా కలుషిత బచ్చలి తిని ఆసుపత్రి పాలైనట్లు తమకు సమాచారం అందలేదని ఆయన వివరించారు.
బాధితులంతా సిడ్నీకి చెందినవారేనని ఎన్ఎస్‌డబ్ల్యూ హెల్త్ వెల్లడించింది. వెంటనే ఇతర రాష్ట్రాల్లోని అధికారులు కూడా అప్రమత్తం అయినట్లు పేర్కొంది

Read more RELATED
Recommended to you

Latest news