రాజస్థాన్ స్పెషల్.. గట్టే కి సబ్జీ.. హెల్తీ అయిన టేస్టీ వంట మీకోసం..!

-

నార్త్ ఇండియాలో గట్టేకి సబ్జీ చాలా ఫేమస్.. ఎప్పుడూ మన వంటలే ఏం తింటాం.. ఏ స్టేట్ లో ఏ వంట ఫేమస్సో అవి కూడా టేస్ట్ చేస్తే భలే మజా వస్తుంది కదా.. ఈరోజు మనం రాజస్థాన్ లో ఫేమస్ వంటల్లో ఒకటైన.. గట్టేకి సబ్జీ (GATTE KI SABJI) ఎలా చేయాలో చూద్దాం.

గట్టేకి సబ్జీ తయారు చేయడానికి కావల్సి పదార్థాలు

శనగపిండి ఒక కప్పు
పెరుగు ఒకటిన్నర కప్పు
టమోటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్
వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర వన్ టేబుల్ స్పూన్
వాము వన్ టేబుల్ స్పూన్
నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్
ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్
ఎండుకారం పొడి వన్ టేబుల్ స్పూన్
జీలకర్రపొడి వన్ టేబుల్ స్పూన్
మీగడ వన్ టేబుల్ స్పూన్
ఎండుమిరకాయలు రెండు
ఇంగువ పొడి కొద్దిగా
పసుపు కొద్గిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని.. శనగపిండి, జీలకర్ర, వాము, పసుపు, కారంపొడి, కొత్తిమీర, పెరుగు, జీలకర్రపొడి, ఇంగువ పొడి, వెల్లుల్లి ముక్కలు, మీగడ వేసి కొద్దిగా వాటర్ సాయంతో పిండి కలపుకోవాలి. రాడ్ షేప్ లో చేసుకుని స్టీమ్ మీద ఉడికించాలి. 20నిమిషాల్లో పిండి అంతా ఆవిరిలో ఉడికిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి.

కర్రీ చేయడానికి ఒక బౌల్ తీసుకుని వాము, జీలకర్రపొడి, కారంపొడి, పసుపు, పెరుగు , నిమ్మరసం కొద్దిగా, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీలా చేయండి. పొయ్యిమీద ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు వేసి.. మీగడ వేసి అది కరిగాక..అందులో వెల్లుల్లి ముక్కలు, చిన్నగా కట్ చేసి టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి వేసి కొద్దిగా నీరు వేసి వేగనివ్వండి. ఆ వేగిన తాలింపులోకి ముందుగా చేసుకున్న గ్రేవీ వేయండి. కర్రీ మరగడం స్టాట్ అయిన తర్వాత.. కట్ చేసుకున్న ఆవిరి మీద ఉడికించిన గట్టా ముక్కలను కూడా వేయండి. పది నిమిషాలు ఉంచి తీసేయడమే.

సాధారణంగా ఇలాంటి వంటల్లో ఆయిల్, ఉప్పు ఎక్కువగా వాడతారు. మనం.. ఆ రెండింటితో పనిలేకుండా.. టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకున్నాం కాద.. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ ఫుల్ గా ఉంటాయి.. అప్పుడప్పుడు మీరు ట్రే చేసి చూడండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version