పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు.. మీకోసమే..

-

చదువుకునే పిల్లల్లో జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఐతే జ్ఞాపకశక్తి అనేది మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియదు. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. అలాంటి ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గుమ్మడి విత్తనాలు

గుమ్మడిని అహారంగా తీసుకోవడం చాలా తక్కువే. ఎప్పుడో ఏదో ఒక పండక్కి తప్ప వీటిని ఆహారంగా తీసుకోరు. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

గుడ్లు

గుడ్డులో ఉండే విటమిన్ బీ6 వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంతే కాదు గుడ్డులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో గుడ్డుని ఆహారంగా తీసుకోవచ్చు.

నారింజ

నారింజలో ఉండే విటమిన్ సి, మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు దానిలోకి అన్నింటినీ సరిగ్గా చేర్చుకుంటుంది. మెదడులో కణాఅలు ఉత్తేజితమై జ్ఞాపకసక్తి పెరుగుతుంది.

బ్లూ బెర్రీ

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల బ్లూ బెర్రీలని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గింజలు

బాదం, కాజు వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. రోజూ పొద్దున్నపూట బాదం గింజలని ఆహారంగా తీసుకోవాలి. ఐతే వీటిని రాత్రి నానబెట్టి, ఉదయం లేవగానే పొట్టు తీసేసి ఆహారంగా తీసుకోవాలి. దీనివల్ల మెదడు చురుగ్గా తయారవుతుంది.

చేప

మంచి కొవ్వు కలిగిన చేపలని ఆహారంగా తీసుకుంటే అందులో కొవ్వు కారణంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. అందులో ఉండే పోషకాలు మెదడు కణాలకి చురుకుదనం ఇచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news