పప్పు వండేప్పుడు నురగ వస్తుంది కదా..? అది ఇన్నాళ్లు మంచిదనే అనుకున్నారుగా..!

-

వంట చేయడం వేరు.., ఆరోగ్యంగా ఉండేలా చేయడం వేరు. చాలామంది టేస్టీగా చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ హెల్తీగా వంట చేయాలంటే మీరు వాడే పాత్రల నుంచే చేసే ప్రాసెస్‌ వరకూ అన్నింటిపై దృష్టిపెట్టాలి. మీరు పప్పు, చికెన్‌ లాంటివి ఉడకపెట్టేప్పుడు నురుగు రావడం చూసే ఉంటారు. ముఖ్యంగా పప్పు ఉడికించేప్పుడు మూత తీయగానే ఆ నురుగు మొత్తం చుట్టుపక్కల వ్యాపిస్తుంది. మనం అదేం పట్టించుకోకుండా అలానే అందులో కూరగాయలు వేసేస్తాం. కానీ ఆ నురుగు ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు చెప్పే విషయం తెలిస్తే..ఇకపై కచ్చితంగా ఆలోచిస్తారు.!

 

సబ్బు లాంటి నురుగు ఏంటి?

మూత తీసి ఉన్న దాంట్లో పప్పు కూరలు వండుతున్నప్పుడు లేదంటే ఉడకబెడుతున్నప్పుడు సబ్బు లాంటి నురుగు అవశేషాలు కనిపిస్తాయి. వాటిని తీసేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం.. పప్పు లేదా కాయధాన్యాలు వండేటప్పుడు కనిపించే నురుగు సపోనిన్‌తో తయారు చేయబడి ఉంటుంది. పప్పులో సపోనిన్ అనే గ్లైకోసైడ్ ఉంటుంది. అవి నీటితో కలిసినప్పుడు కరిగిపోతాయి. ఈ సపోనిన్‌లు సబ్బుతో సమానమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అవి ఉడికేటప్పుడు గాలిని తీసుకుని ఫోం మాదిరిగా ఏర్పడతాయి. పప్పు ఉడికేటప్పుడు అందులోని ప్రోటీన్లు విడుదల అవుతాయని మరొక సిద్ధాంతం చెబుతోంది. వేడి నీరు తగిలినప్పుడు అందులోని వాయువులు గిన్నె ఉపరితం మీద నురుగును ఏర్పరుస్తాయి. దీన్ని ప్రోటీన్ డీనాటరేషన్ అంటారు.

అవి హానికరమా?

ఇలా పప్పు ఉడికేటప్పుడు కనిపించే నురుగు హానికరమా అంటే నిపుణులు అవుననే అంటున్నారు. ఎందుకంటే ఇది గ్లైకోసైడ్ సహజ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి పదార్థాన్ని తీసుకోవడం హానికరమట.. అందుకే వండేప్పుడు ఆ నురుగును తొలగించడం మంచిది.

చికెన్‌లో వచ్చే నురుగు మంచిదేనా?

చికెన్ ఉడికించేటప్పుడు కూడా ఇలానే నురుగు కనిపిస్తుంది. చికెన్ నానబెట్టి అమ్మడం వల్ల అందులోని నీరు ఈ విధంగా నురుగు రూపంలో బయటకి వస్తుందని అనుకుంటారు. చికెన్ ఉడికించేటప్పుడు కనిపించే సబ్బు నురుగుని ఒట్టు అని పిలుస్తారు. ఇది మలినం, ఎముకలపై ఏదైనా మాంసం నుంచి వచ్చే గడ్డకట్టిన ప్రోటీన్‌ని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఏ విధంగానూ హానికరం కాదు. ఇది ఆహార ప్రోటీన్. అయితే ఈ నురుగులో కొవ్వులు, చిన్న ఎముక శకలాలు వంటి ఇతర మలినాలు కూడా కలిగి ఉంటుంది. ఇది మాంసం ఆకృతి, రుచిని ప్రభావితం చేస్తుంది. బాగా ఉడికినప్పుడు ఆ నురుగు ఆవిరై పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news