ఈ కూరలపొడితో ఇక మీ వంటలు సూపర్ టేస్ట్.. ఉప్పులేకుండా వండేయొచ్చు..!

-

కూరల చేసుకునేప్పుడు.. కూరల పొడి చేసుకుని సిద్దంగా ఉంటే.. ఏ కూరల్లో అయినా వేయొచ్చు. దాంతో మంచి టేస్ట్ తో పాటు.. గ్రేవీ కూడా వస్తుంది. అంతే కాదు.. ఉప్పు కూడా మానేయొచ్చు. అసలు ఇలాంటి పొడి వాడటం వల్ల.. నూనె కూడా వాడకుండా.. వండుకోవచ్చు. నూనె లేకుండా వంట చేయడం మన వల్ల కాదు అనుకుంటే… కనీసం వాడే కంటెంట్ అయినా తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్య నాచురల్ విధానంలో కూరల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం.
కూరల పొడి తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు
పల్లీలు 500 గ్రాములు
పచ్చిశనగపప్పు 250 గ్రాములు
కరివేపాకు 1 కప్పు
నువ్వులు 100 గ్రాములు
మినపప్పు 150 గ్రాములు
తయారుచేసే విధానం
పొయ్యి మీద బాండీ పెట్టి.. వేరుశనగప్పుపు( పల్లీలు) వేసి దోరగా వేపించుకోవాలి. సిమ్మ్ లోనే పెట్టి వేపించాలి. పల్లీలు వేగాక తీసేసి మినపప్పు వేసుకుని వేపించాలి. పొట్టు తియ్యని మినప్పుపు అయితే ఆరోగ్యానికే కాదు.. టేస్ట్ కు కూడా చాలా బాగుంటుంది. మినప్పుపును కూడా దోరగా వేపించుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసి వేపించాలి. గుర్తుపెట్టుకోండి.. సిమ్మ్ లోనే పెట్టి దోరగా వేపించాలి. కొంచెం మాడినా టేస్ట్ అంతా పోతుంది. ఇదే చాలా ముఖ్యమైన పార్ట్ కాబట్టి.. జాగ్రత్తగా వేపించుకోవాలి. పచ్చిశనగపప్పు తర్వాత నువ్వులు కూడా వేసి వేపించుకోండి. నువ్వులు ఊరికే మాడిపోతాయి. కాబట్టి కొద్దిసేపు వేపిస్తే చాలు.. తీసాక కలర్ మారిపోతాయి. నువ్వులు వేపించాక.. కరివేపాకు కూడా వేసి వేయించండి.
మనం వేపించుకున్నవి అన్నీ చల్లారిన తర్వత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. దీన్ని ఇగురు కూరలు, వేపుల్లు, చట్నీలు చేసుకునేపప్పుడు ఒకటి రెండు స్పూన్లు వాడుకోవచ్చు. మీకు ఇంకా స్మెల్ కూడా బాగా రావాలి అంటే.. ఈ పొడిలో చిన్నకప్పు సాంబార్ పొడి కూడా కలిపేసుకోవచ్చు. వంటల్లో ఉప్పులేకుండా..ఈ పొడిని వాడుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు.. ఉప్పును పూర్తిగా మానేస్తే.. రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది. ఉప్పులేకుండా మన జీవనశైలి ఉన్నప్పుడే.. ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈ పొడిని తయారుచేసుకుని ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు లేదా.. బయటపెట్టినా వారం పదిరోజులు ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.
– Triveni Bukarowthu

Read more RELATED
Recommended to you

Latest news