Anupama Parameswaran : కొంటె పోజులతో అనుపమ క్యూట్ పిక్స్ వైరల్

-

అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ కలర్ కుర్తీలో ఈ బ్యూటీ చాలా సింపుల్​గా కనిపించింది. ఏదో రెస్టారెంట్​లో కూర్చుని క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సింపుల్​గా ఉన్న అనుపమ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్షణాల్లోనే ఈ ఫొటోలను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

అనుపమ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ఈ బ్యూటీ తన సింప్లిసిటీతోనే చంపేస్తోందంటూ కుర్రకారు కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా అనుపమ నేచురల్ బ్యూటీ బాసూ అంటూ హార్ట్ ఎమోజీస్​తో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

అనుపమ ప్రస్తుతం టాలీవుడ్​లో టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే ఈ భామ బిజీగా ఉంది. టైం దొరికిినప్పుడు ఇలా క్యూట్ పోజులిస్తూ ఆ ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇక ఈ భామ గతేడాది కార్తికేయ 2, 18 పేజెస్​తో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version