Nabha natesh : ప్రకృతిలో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ భామ.. ఫొటోలు వైరల్

-

ఇస్మార్ట్ పోరీ నభ నటేష్ ప్రస్తుతం వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది. నేపాల్​లో ఉన్న ఈ బ్యూటీ పోక్రా హిల్​టాప్​లో ప్రకృతిలో హాయిగా గడుపుతోంది. సమ్మర్ వెకేషన్​లో నభా సూపర్​గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన వెకేషన్​కు సంబంధించిన ఫొటోలను ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో నభా బ్లాక్ డ్రెస్సులో కనిపించింది. బ్లాక్ ప్యాండ్ అండ్ టాప్​పైన బ్లూ కలర్ జాకెట్​తో కనిపించింది. జాకెట్​ను నడుముకు కట్టుకుని క్యాజువల్ లుక్​లో పోజులిచ్చింది. నభా ఫొటోల్లో ఈ బ్యూటీ మేకప్​ లేకుండా కనిపించడంతో అభిమానులు సర్​ప్రైజ్ అవుతున్నారు. ఇస్మార్ట్ పిల్ల మేకప్ లేకపోయినా క్యూట్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక నభా సినిమా కెరీర్​ గురించి మాట్లాడితే ఈ బ్యూటీ నితిన్​తో కలిసి నటించిన మ్యాస్ట్రో సినిమా తర్వాత టాలీవుడ్​లో మరే మూవీకి సైన్ చేయలేదు. ఈ భామ కెరీర్​లో ఇస్మార్ట్ శంకర్ తప్ప పెద్దగా చెప్పుకోలిగే సినిమాలు ఏం లేవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version