కళ్లు ఎర్రగా మారుతున్నాయా..? కారణాలు అనేకం ఒకసారి చెక్‌ చేసుకోండి..

-

కళ్లు అనేవి మనకున్న అన్ని అవయవాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.. ఇవి చేసే పని ఎవరికీ కనిపించదు.. ఇవి లేకపోతే మనకు ఏదీ కనిపించదు..మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని కళ్లను చూసి చెప్పేయొచ్చు..కళ్లు బాగా లోతుగా వెళ్లి నీరసంగా కనపిస్తున్నాయంటే.. ఆ వ్యక్తికి వర్క్‌ ప్రజర్‌ ఉంది, నిద్రసరిగ్గా లేదు, డిప్రషన్‌లో ఏమైనా ఉన్నాడా ఇలాంటివన్నీ తెలుసుకోచ్చు. కళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటే.. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే కళ్లు ఎర్రబడటం అనేది సాధారణంగా అందరిలో వచ్చే సమస్య.. దీనికి కారణాలు చాలా ఉంటాయి.. ఒకటే రీజన్‌ అని లైట్‌ తీసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కళ్లు ఎర్రబారడంతో పాటు దురదగా ఉండడం, మంటగా ఉండడం, లేదా కంటి నుంచి డిశ్చార్జ్ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలా కళ్లు ఎర్రబడి ఇరిటేషన్ రావడానికి ముఖ్యమైన కారణం.. కంటి కలక లేదా కంజెంటివైటిస్. ఇది అంటువ్యాధి.. దీని గురించి మనకు బానే ఐడియా ఉండి ఉంటుంది.. ఇది కాకుండా మరి కొన్ని సిరియస్ కారణాల వల్ల కూడా కళ్లు ఎర్రబారవచ్చని అంటున్నారు. అవేంటంటే..

కోవిడ్ ఒక్కోసారి లంగ్స్, హార్ట్‌కి మాత్రమే కాకుండా కంటిలో కూడా లక్షణాలను కనబరుస్తుంది. అలాంటి సమయంలో కూడా కళ్లు ఎర్రబారుతాయి.

కోవిడ్ కంటి ద్వారా శరీరంలో ప్రవేశించి కంటి వెనుకగా మెదడులోకి కూడా చేరే ప్రమాదం ఉంటుందనేది నిపుణుల హెచ్చరిక.

కంటి పాపకు సోకే అతి సాధారణ ఇన్పెక్షన్లలో ఒకటి బ్లెఫరిటిస్. ఇదొక బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల కూడా కళ్లు ఎర్రబారుతాయి. సాధారణంగా ఇది ఎక్స్పైర్ అయిపోయిన లేదా శుభ్రంగా లేని కంటికి వాడే బ్యూటీ ప్రాడక్స్ట్ వల్ల కలుగుతుంది.

కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కళ్లు వాపుతోపాటు ఎర్రగా మారుతాయి. ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అయితే కళ్ల నుంచి నీళ్లు కారుతాయి.

కొంత మందికి కొన్ని రకాల అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి ఉదాహరణకు పువ్వుల పుప్పొడి వల్ల కొంతమందిలో కంటిలో దురద , ఇరిటేషన్ కలిగి కళ్లు ఎర్రబారుతాయి.

కంటిలో వాడే కాంటాక్ట్ లెన్సులు సరిగ్గా శుభ్రం చేసుకోక పోయినా కంటిలో ఇన్ఫెక్షన్ చేరి కంటిని ఇబ్బంది పెట్టవచ్చు. రాత్రంతా పెట్టుకోవడం, స్నానం చేస్తున్నపుడు వాటిని తీసెయ్యకపోవడం వంటి నిర్లక్ష్యాలు అకాంతమీబా కెరటైటిస్ అనే ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతున్నాయని కొత్త పరిశోధనల్లో తేలింది.

ఇన్ని రకాల కారణాల వల్ల కళ్లు ఎర్రగా మారతాయి.. కాబట్టి కంటికి సంబంధించి వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ ప్రొడెక్ట్స్‌లో ఖరీదైన సరే మంచివే వాడేందుకు ప్రయత్నించండి.!

Read more RELATED
Recommended to you

Latest news