రెడ్‌ వైన్‌తో నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..? అధ్యయనాలు ఏం చెప్తున్నాయ్‌..

-

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు..మందులందు..రైడ్‌ వైన్‌ వేరు..బీర్‌, వోడ్కా, రమ్..ఇలాంటివి తాగితే కిక్క్‌ బానే వస్తుంది కానీ.. ఇవి ఆరోగ్యానికి మెల్లగా పాడు చేస్తాయి. ముఖ్యంగా వోడ్కా అయితే తాగిన మరసటి రోజు చుక్కలు చూపెడుతుంది. కడుపంతా మంట.. ఏం తినాలనిపించదు.. ఆ టైంలో చల్లాగా ఉండే మజ్జిగే మనకు అమృతం అనిపిస్తుంది. రెడ్‌ వైన్‌ అలా ఉండదు.. తాగినట్లు పక్కన వారికి కూడా తెలియదు.. పైగా తెల్లారి ఏ ఇబ్బంది ఉండదు. అలా అని కిక్కు ఎక్కదా అంటే..అదీ లేదు..పిచ్చ కిక్కు ఎక్కుంది.! అందరూ అనే మాటే.. రెడ్‌ వైన్‌ తాగొచ్చు.. దీని వల్ల హెల్త్‌ పాడవదు.. మితంగా వైన్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. మితంగా వినియోగించినప్పుడు వైన్ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని.. కానీ అమితంగా తీసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పరిశోధకులు వైన్‌పై అనేక పరిశోధనలు చేసి.. నమ్మలేని నిజాలను బయటపెట్టారు. అవేంటంటే..

గుండె ఆరోగ్యం..

వైన్ గుండె కణాలను.. కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మీ కరోనరీ ధమనులను కూడా ఇది రిలాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్, ఎల్‌డిఎల్, “చెడు” కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. అంతే కాదు ఇది రక్తం గడ్డకట్టడం, రక్త నాళాలు దెబ్బతినకుండా చేస్తుంది. రెస్వెరాట్రాల్ వాపు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది..

క్యాన్సర్ ..

గ్రీస్‌లోని క్రీట్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే వైన్‌లోని సమ్మేళనాలు.. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నెమ్మదించేలా చేస్తాయని తేలింది.. దీనితో పాటు వైన్‌లో ఫినాల్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. వైన్, ముఖ్యంగా రెడ్ వైన్ నోటి క్యాన్సర్‌ను నయం చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

జీర్ణక్రియ

రెడ్ వైన్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు..కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. నిజానికి రెడ్ వైన్‌ను మితంగా తాగేవారిలో మంచి జీర్ణక్రియ ఉంటుందని పరిశోధనలు తెలిపారు. వైన్ తీసుకోవడం వల్ల హెలికోబాక్టర్ పైలోరీ నుంచి ఇన్ఫెక్షన్ తగ్గుతుందని కూడా నిరూపించారు.

జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు

వైన్ మంచి జ్ఞాపకశక్తిని ఇస్తుందని.. పరిశోధనలు చెప్తున్నాయి. ఈ మిశ్రమంలో ఉండే రెస్వెరాట్రాల్ బీటా-అమిలాయిడ్ ప్రోటీన్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులను నయం చేయడానికి కీలకమైన అంశంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు వైన్ నిజానికి ఇన్ఫ్లమేషన్లు, టాక్సిన్స్‌తో పోరాడడం ద్వారా మీ మనసుకు విశ్రాంతినిస్తుందని పరిశోధన తేల్చింది.

ఎముకలను దృఢత్వం..

రెడ్ వైన్ బోలు ఎముకల వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలో తేలింది. మద్యం తాగని వారితో పోలిస్తే…తాగేవారి ఎముకల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన ద్వారా కనుగొన్నారు. 500 మంది వయస్సు గల స్త్రీలు పాల్గొన్న మరొక పరిశోధనలో ఎముక ఖనిజ సాంద్రత 12% నుంచి 16% వరకు మితమైన మద్యపానం చేసేవారిలో మాత్రమే ఉందని వెల్లడించింది.

మితంగా తాగితినే..

అతిగా చేస్తే ఏదైనా కొంపముంచుతుంది.. ముఖ్యంగా మద్యం విషయానికి వస్తే ఇది వంద శాతం నిజం. ఆరోగ్యానికి ఎంత మంచిదైనా.. అతిగా తీసుకుంటే.. మరిన్ని సమస్యలు వస్తాయి. అతిగా తాగడం వల్ల పక్షవాతం, గుండె ఆగిపోవడం, కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు, పలు సమస్యలకు మందులు వాడే వారు దీనికి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news