వయాగ్రా ఎక్కువగా వాడుతున్నారా.. అయితే కళ్లకు ఈ సమస్యలు తప్పవుగా

-

కొందరు రెగ్యులర్ గా వయాగ్రా తీసుకుంటారు. రతి ఎక్కువ అవ్వాలని అతిగా వయాగ్రా వాడితే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా వయాగ్రా ఎక్కువగా తీసుకునే వారి మీద చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 80 శాతం మందికి కంటి చూపు కోల్పోవచ్చని తేలింది.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు వయాగ్రా ఎక్కువగా వాడే వారిమీద పరిశోధన చేశారు. వయాగ్రా, సియాలిస్, లెవిట్రా, స్పాడ్రాలలో వినియోగించే కెమికల్స్ కళ్లకు సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వయాగ్రాను తీసుకున్నప్పుడు వారి శరీరంలో రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. ఇది కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దాని ప్రభావం కారణంగా, ఆకస్మిక దృష్టి లోపం ఏర్పడుతుంది. కళ్ళలో నల్ల మచ్చలు ఏర్పడతాయి.
వయాగ్రా అనార్థాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు నాలుగేళ్లపాటు సుమారు 2 లక్షల మందిపై పరిశోధనలు చేశారు. దీన్ని రెగ్యులర్ గా వాడేవారిలో మాత్రమే కళ్లకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని పరిశోధనలో తేలింది. వీటిలో రెటీనాకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
పరిశోధనలో పాల్గొన్న పురుషుల్లో ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి ప్రమాదం 102% పెరిగినట్లు నిపుణులు అంటున్నారు. కళ్ళలోని సిరల్లో రక్త సరఫరా అసాధారణంగా మారుతుంది. కంటి చూపు పోతుంది. 44 శాతం మంది పురుషులకు రెటీనాలో రక్తం గడ్డకట్టే సమస్య ఉండవచ్చని కూడా పరిశోధకులు అంటున్నారు.
ఇక వయాగ్రాను తయారు చేసే సంస్థ ఫైజర్ సైతం.. దీనిని తీసుకునే ప్రతి 100 మందిలో ఒకరు కళ్ల మంట, కళ్లలో ఎరుపు, నొప్పి, నీళ్ళు కారుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారని కూడా తెలిపింది. కాబట్టి వాడేవారు ఈ విషయాలు దృష్టిలోపెట్టుకుని మితి మీరకుండా ఉంటే మంచిది. వయాగ్రా వాడాల్సిన అవసరం ఉన్న వారిలో.. అందుకు ప్రత్యామ్మయంగా నాచురల్ మార్గాలను అన్వేషించి ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. చాలామంది తెలిసి తెలియక శృంగారం విషయంలో చేసే తప్పులు వల్ల ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. గర్భనిరోధక మాత్రలు కూడా స్త్రీలు వాడుతుంటారు. వీటి వాడకం అస్సలు మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news