భారీగా బరువు పెరుగిపోతున్నారా..? అయితే ఈ అలవాట్లకు దూరంగా ఉండాల్సిందే..!

-

చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటారు. బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించవు. అయితే ఇక్కడ బరువు తగ్గాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఈ అలవాట్లకు దూరంగా ఉంటే త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 

మనం తీసుకునే ఆహారం జీవనశైలి బట్టి మన బరువు ఉంటుంది అయితే అధిక బరువుతో బాధపడే వాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి:

రాత్రి భోజనం తినే ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోండి దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. దీంతో బరువు తగ్గడానికి అవుతుంది.

ఆహారాన్ని లైట్ గా తీసుకోండి:

రాత్రిపూట ఆహారాన్ని లైట్ గా తీసుకుంటూ ఉండాలి. అల్పాహారం ఎక్కువగా, లంచ్ అల్పాహారం కంటే కొంచెం తక్కువగా, డిన్నర్ లంచ్ కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలానే రాత్రి నిద్ర పోవడానికి తీసుకునే ఆహారానికి మధ్య రెండు గంటల సమయం ఉండేటట్లు చూసుకోండి.

ఆల్కహాల్ కి దూరంగా ఉండండి:

రాత్రి నిద్రపోయే ముందు ఆల్కహాల్ ని తీసుకోవద్దు ఆల్కహాల్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. నిద్రపోయే ముందు తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

నిద్రపోయే ముందు స్నానం చేయండి:

నిద్రపోయే ముందు స్నానం చేస్తే రిలాక్స్ గా ఉంటుంది దీంతో నిద్ర బాగా పడుతుంది. మంచి నిద్ర పడితే ఫ్యాట్ కూడా కరుగుతుంది. అలానే రాత్రి నిద్రపోయే ముందు మెడిటేషన్ చేయడం కూడా మంచిది మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news