ఇటీవల కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్లబడిపోతుంటుంది. ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి. దీంతో చాలా మానసికంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తెల్ల జుట్టుకు కెమికల్స్ కలిపిన రంగును పూసుకుంటున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ జుట్టుకు మరింత హాని చేకూర్చుతాయి. నిజానికి ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం.
అలాగే కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. మరియు వంశపారంపర్య లక్షణాల మూలంగా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎవరికైనా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలని ఉంటుంది. అయితే తొందర పాటు వల్ల అనేక సమస్యలకు దారి తీస్తాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– ఆలివ్ నూనెతో జుట్టును బాగా మర్దన చేసి కొంత సమయం తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
– పచ్చి కొబ్బరి పాలు తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసి మర్దన చేడాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా, రాలడం కూడా తగ్గుతుంది.
– అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. కొంత సమయం తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, నల్లగా మారతుంది.
– కరివేపాకు పేస్ట్ చేసి తలకు పట్టించాలి. కొంత సమయం తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
– మెంతులను నీటితో రాత్రంతా నానబెట్టి మార్నింగ్ ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఉపయోగపడుతుంది.
– ఉసిరికాయలను పేస్ట్ లా చేసి తలకు పట్టించి 30 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.