ఆపిల్స్ లో చాలా రకాల పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది మరియు మన శరీరంలో చాలా అవయవాలకు సరైన పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. అయితే ఆపిల్స్ ను సరైన సమయంలో తీసుకోవడం వల్ల మాత్రమే పూర్తి ప్రయోజనం కలుగుతుంది. మరి యాపిల్స్ ను ఏ సమయంలో తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఆపిల్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రతి రోజూ ఒక ఆపిల్ పండును తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండె జబ్బులు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన జబ్బులు గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి వాటికి ఆపిల్ చాలా సాయపడుతుంది. అంతే కాదు లివర్, ఊపిరితిత్తులు, బ్లడ్ షుగర్ మొదలైన సమస్యలను దూరం చేయడానికి ఆపిల్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఆపిల్స్ ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం కలుగుతుంది.
ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో భాగంగా ఆపిల్స్ ను అలవాటు చేసుకోండి, ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా సహాయం చేస్తుంది. అయితే రాత్రి సమయంలో ఆపిల్స్ ను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ శాతం ఫైబర్ ఉండడం వల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయాన్నే ఆపిల్స్ ను తినండి.