జాకింగ్ చేస్తుంటారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే.. పాటించడం మరచిపోవద్దు..!

-

శారీరక వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతి రోజు చాలా మంది జాగింగ్ చేస్తూ ఉంటారు నిజానికి ఉదయాన్నే జాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. దీని వలన ఎన్నో రకాల ప్రయోజనాలను మీరు పొందవచ్చు అయితే ప్రతిరోజు జాకింగ్ కి వెళ్లే వాళ్ళు ఈ విషయాలని అస్సలు మర్చిపోకండి. ప్రతి సీజన్ లాగా చలికాలం కాదు. చలికాలంలో చల్లటి గాలి మంచు ఉంటూ ఉంటాయి అటువంటప్పుడు మీరు జాగింగ్ కి వెళితే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని చలికాలంలో మీరు జాకింకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఎక్కువసేపు వార్మప్ చేయండి:

చాలామంది వ్యాయామం చేసే ముందు వార్మప్ చేస్తూ ఉంటారు చలికాలంలో
వార్మప్ చేసేటప్పుడు ఎక్కువసేపు వార్మప్ చేస్తే మంచిది దీనివలన ఏమవుతుందంటే చలికి కండరాలు గట్టి పడిపోతాయి. శరీరం లోపలి నుండి వేడి ఇవ్వకుండా వ్యాయామం మొదలుపెడితే కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. దానితో కండరాల తిమ్మిరి నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి.

కూల్ డౌన్ తక్కువ ఉండాలి:

కూల్ డౌన్ ప్రక్రియ తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాలి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది మానకండి:

చలికాలంలో మీరు కనుక వాకింగ్ చేసినా జాకింగ్ కి వెళ్ళినా రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి చలికాలంలో వ్యాయామం చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు.

శ్వాసక్రియ పై శ్రద్ధ పెట్టండి:

చలికాలంలో జాకింగ్ చేసే వాళ్ళు శ్వాసక్రియ పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సరైన శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం.

నోటి ద్వారా చల్లని గాలిని పీల్చకండి:

చల్లని శ్వాస వలన శ్వాసకోశ, శ్లేష్మ పొరలు కూడా కూల్ గా మారిపోతూ ఉంటాయి ఇలా చాలా రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

మఫ్లర్ లేదా మాస్క్ పెట్టుకోండి:

మీరు వాకింగ్ లేదా జాకింగ్ కి వెళ్లేటప్పుడు మఫ్లర్ ని కానీ మాస్క్ ని కానీ ధరించండి దీని వలన ఏమవుతుంది అంటే గాలిని పీల్చకుండా వెచ్చగా తేమగా గాలి మారుతుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా జాకింగ్ చేసినా కూడా మీకు ఇబ్బందులు రావు లేదంటే ఆస్తిమా జలుబు మొదలైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news