క్యాన్సర్ నివేదిక విడుదల చేసిన ఐసీఎమ్ఆర్

-

జాతీయ క్యాన్సర్ నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్( ఐసీఎంఆర్) విడుదల చేసింది. ఈనివేదిక పలు రకాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.గణాంకాలు, క్యాన్సర్లకు దారి తీసే కారణాలను నివేదిక తెలిపింది. దీంట్లో పలు రకాల ఆసక్తికరమైన విషయాలను నివేదిక వెల్లడించింది. 2012-19 మధ్యకాలంలో దేశంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి 13,32,207 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆడవారితో పోలిస్తే మగవారిలోనే క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నట్లు నివేదిక తెలిపింది. మొత్తం క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో వ్యాధి బారిన పడిన మగవారి శాతం 52.4 శాతంగా ఉంది. వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో ఎక్కువ శాతం అంటే 32.4 శాతం తల, గొంతు క్యాన్సర్లే అధికంగా ఉంటున్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. మహిళల విషయంలో బ్రెస్ట్, గైనిక్ క్యాన్సర్లు అధికంగా 47.4 శాతం ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 0-14 ఏళ్ల పిల్లల్లో లుకేమియా అధికంగా ఉందని తెలిపింది. పొగాకు ఉత్పత్తులు, కాలుష్యం వల్ల ఎక్కువగా క్యాన్సర్లు సంబవిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. వీటి కారణంగానే మగవారిలో తల, గొంతు క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news