మారుతున్న కాలానుగుణంగా మనిషి మారుతున్నాడు. ఆహారపు అలవాట్లు సైతం మారిపోతున్నాయి. దీని వల్ల చిన్న వయస్సు లోనే అనేక ఆరోగ్య సమస్యలకు గురువతున్న విషయం తెల్సిందే.

ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత జబ్బులు కారణంగా మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ గుండె సంబంధిత జబ్బులు తగ్గించేందుకు అనేక రకమైన పరోశోధనలు చేస్తున్నారు. తాజాగా లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన నిపుణులు ఈ కింది విధంగా పేర్కొన్నారు.

రోజుకు కనీసం 20 గ్రాముల నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్లు మరియు ఇతరత్రా వ్యాధులూ వచ్చే అవకాశం చాలా తక్కువ.