డబుల్‌ చిన్‌కు కారణాలు.. తగ్గించుకునే మార్గాలు..!

లావుగా ఉండటం ఒక సమస్య..అయితే కొందరు లావుగా ఉండరు కానీ.. ముఖం దగ్గరకు వచ్చే సరికి డబుల్‌ చిన్‌ ఉంటుంది. నిజానికి ఇది వచ్చింది అంటే.. మీరు లావు అవ్వబోతున్నారు అని సంకేతమే.. ఇలా గడ్డం కింద గడ్డం కనిపిస్తే.. ఫేస్‌ లుక్‌ మారిపోతుంది. మరీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దామా..!

డబుల్ చిన్ రావడానికి కారణాలు ఏంటి..?

అధిక బరువు – ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం, తగ్గినప్పుడు అక్కడి చర్మం వదులుగా మారడమే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు.

వంశపారంపర్యంగా – అవును జన్యుపరమైన కారణాలుంటే మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

వయసు పైబడడం – వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం, కొవ్వు పేరుకుపోవడం.. వంటివి ఈ సమస్యకు కారణమవుతాయట! కాబట్టి కండరాల దృఢత్వానికి, కొవ్వు కరగడానికి వ్యాయామాలు చేస్తే కొంతకాలం వరకూ యవ్వనంగానే ఉండొచ్చు.

తగ్గించుకునే మార్గాలు

డబుల్‌చిన్ సమస్యతో ఉన్నవారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది పటిష్టంగా తయారవుతాయి. దీని వల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా ముఖాకృతి చక్కగా ఉంటుంది. అలాగే షుగర్‌ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా ఫేస్‌కు మంచి ఎక్సర్‌సైజ్‌ అవుతుంది.

రెండు గుడ్లలోని తెల్లసొన, ఒక టేబుల్‌స్పూన్ పాలు, కాస్త తేనె, నిమ్మరసం.. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ, డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఉంచి..గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఫలితంగా డబుల్‌చిన్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గుడ్డు వాసన నచ్చని వారు ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు.

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, స్వీట్ కార్న్, యాపిల్, సోయా బీన్స్, పప్పు దినుసులు.. ఇలాంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. తద్వారా డబుల్‌చిన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

మెడ గుండ్రంగా, మెల్లగా కొద్ది సమయంపాటు తిప్పడం, పైకి కిందకు కదిలించడం.. మొదలైన చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కూడా ఫలితం ఉంటుంది.

బరువు పెరగడం వల్ల వచ్చే డబుల్‌ చిన్‌కు వ్యాయామాలు చేస్తేనే త్వరగా రిజల్ట్‌ వస్తుంది. రెండు బుగ్గలను నోట్లోకి లాగి వీలైనంత సమయం ఉంచుకోండి. ఇలా చేయడం వ్లల చెంపల దగ్గర, గడ్డం దగ్గర కొవ్వు కరుగుతుంది.

మూతి ముందుకు పెట్టి తల పైకి ఎత్తి చూడటం. ఇలా చేయడం వల్ల కూడా గడ్డం కింద కొవ్వు కరుగుతుంది.

బరువు తగ్గడం వల్ల స్కిన్‌ లూస్‌ అయి డబుల్‌ చిన్‌ ఏర్పడితే.. విటమిన్‌ ఈ ఆయిల్‌ను డైలీ వాడటం అలవాటు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు చిన్న దగ్గర అప్లై చేసి పడుకోని ఉదయాన్నే క్లీన్‌ చేసుకోవాలి. విటమిన్‌ ఈ ఆయిల్‌ వల్ల స్కిన్‌ టైట్‌ అవుతుంది.