చాలా మంది ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే మందులతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. వీటిని మీరు తీసుకోకుండా ఉంటే హెల్తీగా ఉండొచ్చు. అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరల్ని తీసుకోకూడదు.
వీటిని తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు పై ప్రభావం పడుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఉన్నట్లయితే సోయాతో చేసిన ప్రొడక్ట్స్ ని కూడా తీసుకోవద్దు. సోయా ఉత్పత్తులను తీసుకుంటే కూడా హెల్త్ కి మంచిది కాదు. ఇటువంటి వాటిని తీసుకోవడం వలన నెగటివ్ ప్రభావం పడుతుంది.
సోయా, థైరాయిడ్ గ్రంధి శరీరంలో అయోడిన్ ని వినియోగించకుండా అడ్డుకుంటుంది. కాఫీ, ఆల్కహాల్ వంటివి కూడా తీసుకోకండి. ఇవి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళపై ప్రభావం పడతాయి. స్ట్రాబెర్రీస్ వంటి పండ్లను కూడా తీసుకోకూడదు. ఇలా డాక్టర్ చెప్పిన ఈ విషయాలను మీరు ఫాలో అయినట్లయితే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రభావం పడదు. ఇబ్బందులు రావు. కనుక థైరాయిడ్ ఉన్నవాళ్లు తప్పులు చేయకుండా చూసుకోండి.