మీ చేతికి ఉన్న ఉంగరం వల్ల ఎన్ని కోట్ల సూక్ష్మ క్రిములు జీవిస్తాయో తెలుసా..!

-

ఉప్పు ఎందులో వేసినా ఉప్పగానే ఉండాలి కదా.. కానీ. పైనాపిల్‌ మీద వేస్తే తియ్యగా ఉంటుంది తెలుసా.. మనుషులు అయినా…పక్షులు అయినా ముందుకు మాత్రమే వెళ్లగలరు.. మనం అయితే ట్రే చేస్తే..సరదాగా వెనక్కు నడవగలం కానీ.. అది ఇంట్లో మాత్రమే.. కానీ ఓ జాతి పక్షులు అవలీలగా వెనక్కు కూడా ఎగరగలవట.. ఏదైనా రికార్డులు సృష్టిస్తే..గిన్నిస్‌ బుక్‌లో ఎక్కుతాం.. మరి ఈ భూమిపై అంతరించి పోయే పక్షులు, చెట్లు కోసం కూడా స్పెషల్‌గా ఒక బుక్‌ ఉంది. అలాగే వేలికి తొడుక్కునే రింగ్‌ వల్ల 73 కోట్ల సూక్ష్మక్రిములు జీవిస్తాయట. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మీకోసం.!

అప్పుడే పుట్టే పాండా పిల్ల సుమారు 100 గ్రాములు మాత్రమే ఉంటుందట.

పెళ్లి కాని వాళ్ల కంటే… పైళ్లెన వాళ్లు 30 శాతం ఎక్కువ సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకో మనందరికే తెలిసిందే..!

మీరు పైనాపిల్‌ ముక్కలపై ఉప్పు చల్లితే… అవి మరింత తియ్యగా అయిపోతాయి.

లీటర్ తేనెను… తేనెటీగలు… 20 లక్షల పూల నుంచి సేకరిస్తాయట. అమ్మో గొప్ప విషయమే ఇది.!

ప్రపంచంలో వెనక్కి కూడా ఎగరగల పక్షులు హమ్మింగ్ బర్డ్స్ (Hummingbirds) మాత్రమే.

మనుషుల వేలి ముద్రలు ఎలాగైతే ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయో… కుక్క మూతిపై ప్రింట్స్ కూడా ఒక్కో దానికి ఒక్కోలా ఉంటాయట

మనిషి శరీరం బరువుతో పోల్చితే మెదడు బరువు 2 నుంచి 3 శాతం మాత్రమే. కానీ అది మనిషి పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం వాడేసుకుంటుందట.

వేలికి తొడుక్కునే ఉంగరం వల్ల ఆ ప్రదేశంలో 73 కోట్ల సూక్ష్మ క్రిములు జీవిస్తాయి. కొందరు నాలుగు ఐదు ఉంగరాలు వేసుకుంటారు.. అంటే ఎన్ని క్రిములు ఉంటాయో.. !

క్యాసినో రౌలెట్టేలోని నంబర్లన్నింటినీ కలుపుతూపోతే… మొత్తం 666 అవుతుంది. దీన్ని బీస్ట్ నంబర్ (number of the beast) అంటారట. మీకు ఆడే అలవాటుందా..!

శంఖం లేదా ఏదైనా గొట్టం లాంటిది చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు శబ్దం వస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చే ధ్వనులు ప్రతిక్షేపణం చెందడం అలాగే మన శరీరంలో రక్త ప్రవాహం కలిసి ఆ ధ్వనులు వినిపిస్తాయట.

ప్రపంచంలోని 12 శాతం మంది ప్రజలకు కలలు బ్లాక్ అండ్ వైట్‌లోనే వస్తాయి. అవునా..ఈ సారి మీరు గమనించండి.!

అంతరించే వాటికి సంబంధించి బ్లాక్ బుక్ ఉంటుంది . అందులో భూమిపై అంతరించిపోయిన జంతువులు, పక్షులు, మొక్కల వివరాలు రాస్తారట.

ప్రపంచంలో అతిపెద్ద కీటకాలుగా జెయింట్ లీఫ్ కీటకాల (Giant leaf insects)ను చెబుతారు. వాటి పొడవు 24 అంగుళాలు.

నిప్పుకోళ్లు (Ostriches) అప్పుడప్పుడూ తమ తలను ఇసుకలో దూర్చుతాయి. ఇసుకలోని గులకరాళ్లను మింగేస్తాయి. తద్వారా వాటికి ఆహారం అరుగుతుంది. డైనోసార్లు కూడా రాళ్లను మింగేస్తాయట.

ప్రపంచంలో అత్యంత తేలికైన పదార్థం గ్రాఫెన్ ఎయిరోజెల్ (graphene aerogel). ఇందులో 99.8 శాతం గాలే ఉంటుంది. కానీ తన బరువు కంటే 4వేల రెట్లు ఎక్కువ బరువు మొయ్యగలదట.

Read more RELATED
Recommended to you

Latest news