తరచూ వెన్నునొప్పి బాధిస్తుందా..? ఈ క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు..

-

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న 12వ అత్యంత సాధారణ క్యాన్సర్‌ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఇతర క్యాన్సర్ మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాటిక్ అనేది కడుపులోని ముఖ్యమైన భాగం. చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి ఇది. శరీరంలో ముఖ్యమైన పనులను ఈ ప్రేగు నిర్వర్తిస్తుంది. అటువంటి ఈ గ్రంథిని జాగ్రత్తగా చూసుకోకుంటే క్యాన్సర్‌ భారిన పడక తప్పదు.. కొన్ని లక్షణాల ద్వారా ఈ క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చు. ఇవి సాధారణంగానే ఉంటాయి..అవేంటంటే..

జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకి వ్యాపిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు (బొడ్డు), కాలేయానికి వ్యాప్తి చెందుతాయని తెలిపారు.. ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

వెన్నులో నొప్పి

క్యాన్సర్ ఏ భాగంలో వచ్చిందనే దానిపై ఆధారపడి దాని లక్షణాలు మారిపోతుంటాయి. క్యాన్సర్ కణితి వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన సంకేతం నొప్పి. వీటి వల్ల వచ్చే నొప్పి నిరంతరంగా ఉంటుందట… శరీరం ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం వీపుభాగం. ఈ భాగంలో నొప్పి నిరంతరంగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాప్తి చెందినప్పుడు ఈ వెన్నునొప్పి విపరీతంగా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.. తినేటప్పుడు లేదా పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పికి రావడాన్ని గుర్తించొచ్చు.

కణితి వ్యాప్తి చెందే సంకేతాలు..

ఎముకలు బలహీనపడిపోయి సులభంగా విరిపోతాయి.

రక్తంలో కాల్షియం స్థాయిలు అనూహ్యంగా పెరిగిపోతాయి. దీన్నే హైపర్‌కాల్సెమియా అంటారు. దీని వల్ల కన్ఫ్యూజన్, అనారోగ్యం, జీర్ణాశయంత్ర సమస్యలు వస్తాయి.

రక్త కణాల సంఖ్య పడిపోతుంది

పొత్తి కడుపు నొప్పి వెనుకకు వ్యాపించడం

కామెర్లు

అలసట, ఆకలి లేకపోవడం

మలం రంగు మారిపోవడం

బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం

చర్మం దురద పెట్టడం

మధుమేహం

వికారం, వాంతులు

కళ్ళు పసుపు రంగులోకి మారపోవడం

ఈ సంకేతాలు కనిపించినంత మాత్రాన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్టు అని ఫిక్స్‌ అయిపోకండి.. ఇవి కనిపిస్తే క్యాన్సర్ వల్లే కాదు ఇతర పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు. అందుకే ఇటువంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news