కూల్‌ వాటర్‌తో బాత్‌ చేస్తే హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయా..?

-

బీపీ, షుగర్‌ లాంటివి ఉన్నా..అవి అలా ఉంటాయ్‌ కానీ.. అప్పటికప్పడు ఎలాంటి ప్రమాదం తెచ్చిపెట్టవు.. కానీ గుండెజబ్బులు అలా కాదు.. పోతే ప్రాణాలు..లేకపోతే పైసలు.. మంచి నీళ్లలా డబ్బుఖర్చుపెడితే కానీ.. బతుకు నిలవదు.. మనిషి శరీరంలో గుండె చాలా ముఖ్యమైన పార్ట్.. ఆరోగ్యపరంగానూ.. మానసికంగానూ.. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. మానసికంగా బాలేకుంటే.. దాని ఎఫెక్ట్‌ గుండె మీదే పడుతుంది. మరి ఇలాంటి ఈ చిట్టి గుండెను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండోయ్..! జనరల్‌గా బాడీకీ చల్లనీటి స్నానం మంచిదంటారు. స్కిన్‌ పాడవకుండా ఉంటుంది అని.. కానీ చల్లని నీటితో స్నానం చేయడం గుండెకు మంచిది కాదంటున్నారు నిపుణులు..! అందానికి పోయి.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు..

చల్లని నీరు గుండెకు ఎలా ప్రమాదం..?

చల్లని ఉష్ణోగ్రతలు గుండె, రక్తప్రసరణపై ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి. ప్రధానంగా చన్నీటి స్నానం వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచించబడతాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. చల్లని గాలి కన్నా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయటం వల్ల శరీరంపై ఎక్కవ ప్రభావం ఉంటుంది. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల రక్తనాళాలపై భారం పడుతుంది.

చల్లని నీరు శరీరానికి తగిలినప్పుడు ఒక్కసారిగా షాక్ తగిలిన భావన కలుగుతుంది. హార్ట్ బీట్‌లో సైతం తేడా వస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకుండా ఉండటమే ఉత్తమం. వేడి వాతావరణంలో, అకస్మాత్తుగా చన్నీటి స్నానం చేస్తే హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదం మరింత ఎక్కువ. దీని కారణంగా శ్వాస ఆడకపోవడం, భయాందోళనలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

షవర్‌ బాత్‌ మంచిదేనా..?

షవర్ బాత్‌లు, వాటర్ ఫ్లో అధికంగా ఉండే స్నానాలు చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చల్లటి నీరు శరీరంపై ఒక్కసారిగా పడటం వల్ల న్యూరోజెనిక్ కార్డియో రెస్పిరేటరీ ప్రతిస్పందనలకు దారితీసి ఆప్రభావంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు సాద్యమైనంత వరకు గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. నీరు మరీ అంత వేడిగా కూడా ఉండకూడదు. ఇలాంటి వారు షవర్ల క్రింద స్నానం చేయటం ఏమంత మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. చల్లనీటితో స్నానం చేయాలనిపిస్తే ముందుగా కొద్ది మొత్తంలో గోరు వెచ్చని నీటిని శరీరంపై పోసుకున్న తరువాత చల్లనీటితో స్నానం చేయొచ్చు..

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news